Manipur Violence: ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో రాహుల్ కాన్వాయ్ అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‌పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడతారు. అయితే మొదటిరోజే చురాచాంద్‌పూర్ జిల్లాలోని ప్రజలను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు
- tony bekkal
- Published On : June 29, 2023 / 03:36 PM IST
Rahul Gandhi: దాదాపుగా రెండు నెలలుగా నిప్పుల కుంపటిలో రగులుతున్న మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 20 కిలోమటర్ల దూరంలో కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మణిపూర్ చేరుకున్న రాహుల్.. అల్లర్లకు కారణమైన చురాచాంద్‌పూర్ జిల్లాకు బయల్దేరారు. ఈ సందర్భంలోనే ఆయన కాన్వాయ్‌ని అడ్డుకుని మధ్యలోనే నిలిపివేశారు.
Uttar Pradesh : సరయూ నదిలో ‘పానీ మే ఆగ్ లగాని హై’ అంటూ యువతి డ్యాన్సులు.. మండిపడుతున్న నెటిజన్లు
కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‌పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడాల్సి ఉంది. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడతారు. అయితే మొదటిరోజే చురాచాంద్‌పూర్ జిల్లాలోని ప్రజలను కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు సున్నితంగా ఉండడం వల్లనే అడ్డుకోవాల్సి వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేకి ఇంఫాల్‌కు తిరిగివచ్చారు.
Godzilla Ramen : “గాడ్జిల్లా రామెన్” ఇంటర్నెట్‌ను భయపెడుతున్న వంటకం
రాష్ట్రంలోని మైతీ-కుకీ జాతుల మధ్య ఏర్పడ్డ వైరం తీవ్ర పరిస్థితులకు దారి తీసింది. మే 3వ తేదీన ఈ వర్గాల మధ్య మొదటిసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. తమను షెడ్యూల్డ్ కులాల్లో కలపాలంటూ మైతీ వర్గం నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడేటరీ మార్చ్’పై దాడితో ఈ ఘర్షణ మొదలైంది. మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం వరకు ఉంటారు. వారంతా ఇంఫాల్ లోయలో ఉంటారు. ఇక నాగాలు, కుకీలు 40 శాతం ఉంటారు. వీరు ఇతర జిల్లాల్లో ఉంటారు.
