Rahul Gandhi Protest: ప్రధాని ఇంటి ఎదుట రాహుల్, ప్రియాంకా నిరసన.. మోదీ రాజీనామాకు డిమాండ్..

Rahul Gandhi Protest: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు పలు వురు సీనియర్ నేతలు మోదీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. నీట్ పేపర్ లీకేజ్ ని అరికట్టలేని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Updated on- July 21, 2026 / 06:00 PM IST

Rahul Gandhi Protest Near PM Modi Residence Demand Resignation NEET Paper Leak

Rahul Gandhi Protest: ఢిల్లీలో నిరసనలు హోరెత్తుతున్నాయి. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పాటు పలు వురు సీనియర్ నేతలు మోదీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. నీట్ పేపర్ లీకేజ్ ని అరికట్టలేని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేద్రప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సీజేపీ కార్యకర్తల మీద లాఠీఛార్జీ చేయించిన హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్షం మొత్తం ప్రధాని ఇంటి ఎదుట ధర్నాకు దిగడంతో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.

Also Read: ఇక ఎల్పీజీ గ్యాస్‌కు గుడ్‌బై.. త్వరలో ఇథనాల్ ఏటీఎంలు.. మార్కెట్లోకి కొత్త ఇథనాల్ స్టవ్‌లు

మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ప్రధాని ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను కలిశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో మాట్లాడారు. ధర్నాను విరమించాలని కోరారు. తాము ఆందోళనలను విరమించేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అవసరమైతే రాత్రి మొత్తం ప్రధాని ఇంటి ఎదుట ధర్నాలో కూర్చుంటామని స్పష్టం చేశారు. దీంతోపాటు ఐదు డిమాండ్లను జితేంద్ర సింగ్ ఎదుట ఉంచాలి.

కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లు

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
పార్లమెంట్ వేదికగా హోంమంత్రి ప్రకటన చేయాలి
నీట్ అంశంపై పార్లమెంట్ లో చర్చను  చేపట్టాలి
విద్యార్థుల సమస్యలను వినాలి
సీజేపీ ధర్నా సందర్భంగా జరిగిన హింసపై విచారణ జరపాలి

కాంగ్రెస్ డిమాండ్లను తెలుసుకున్న తర్వాత జితేంద్ర సింగ్.. హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కాంగ్రెస్ డిమాండ్లను ఆయన ముందు ఉంచారు.