Doctor Suicide: ‘అమాయకపు డాక్టర్లను వేధించకండి’

రాజస్థాన్‌లోని మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ లో రాసిన లేఖ చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దేశ రాజధానిలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. వీధుల్లోకి వచ్చిన డాక్టర్లు..

Doctor Suicide

Doctor Suicide: రాజస్థాన్‌లోని మహిళా డాక్టర్ సూసైడ్ నోట్ లో రాసిన లేఖ చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దేశ రాజధానిలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. వీధుల్లోకి వచ్చిన డాక్టర్లు రాష్ట్ర పోలీసులను దీనిపై న్యాయం జరగాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అర్చన శర్మ అనే డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగిన మృతి పట్ల హత్య కేసు నమోదుకావడం ఈ ఘటన మొత్తానికి కారణమైంది.

రాజస్థాన్ లోని దౌసాలో ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహిళ.. మంగళవారం హేమరేజ్ కారణంగా మృతి చెందింది. ఆ తర్వాత ఆమె తరపు బంధువులు, కుటుంబీకులు కలిసి హాస్పిటల్ బయట ఆందోళనలు మొదలుపెట్టారు. ఫలితంగా డా. అర్చన శర్మ, ఆమె భర్త పేరు మీద మర్డర్ కేసు నమోదైంది.

ఆందోళనలతో పాటు ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదుకావడంతో అర్చన విస్తుపోయిందని పోలీసులు తెలిపారు. భర్తతో కలిసి హాస్పిటల్ ను నడిపిస్తున్న ఆమె.. సూసైడ్ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అందులో అమాయకపు డాక్టర్లను వేధించొద్దని పేర్కొంది. దాంతో పాటు తన మరణం తర్వాత భార్యను, ఇద్దరు పిల్లలను వేధించొద్దని కోరింది.

Read Also : నొప్పి లేకుండా చనిపోవటానికి సూసైడ్ మిషన్

కేసుపై తగిన చర్య తీసుకుంటామని మాటిచ్చిన సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ‘డా. అర్చన శర్మ ఆత్మహత్య బాగా విచారకరం. డాక్టర్లను దేవుళ్లుగా పరిగణిస్తాం. పేషెంట్ల ప్రాణాలు కాపాడటానికి వారి వల్ల అయినంత వరకూ ప్రయత్నిస్తారు. ఏదైనా తప్పు జరిగితే.. డాక్టర్లను నిందించడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.

ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, తగిన చర్యలను కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.