Suicide Machine : నొప్పి లేకుండా చనిపోవటానికి సూసైడ్ మిషన్

నొప్పి లేకుండా చనిపోవటానికి సూసైడ్ మిషన్ తయారు చేశారు నిపుణులు. ఈ మిషన్ కు ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వటం గమనార్హం.

Suicide Machine : నొప్పి లేకుండా చనిపోవటానికి సూసైడ్ మిషన్

Switzerland Suicide Machine

Switzerland suicide machine : ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు నొప్పి లేకండా చనిపోవటానికి ఓ మిషన్ తయారు చేశారు. ఇదేంటిరా బాబూ బతకటానికి మందులు కనిపెట్టాలి..బతకాలని చెప్పాలి గానీ ఇదేంటీ ఆత్మహత్య చేసుకోవటానికి ప్రత్యేకించి ఓ మిషన్ తయారు చేయటమేంటీ? అని ఆశ్చర్యంకలుగుతుంది. కానీ ఇది టెక్నాలజీ యుగమాయే..ఏదైనా సాధ్యమే. కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎన్ని ఉన్నా..బతకటానికి కారణాలు వెతుక్కోవాలి తప్ప చనిపోవటానికి కాదు అనే విషయం అర్థం చేసుకోండీ ఈ వార్త చదివేముందు. కానీ ఈ సూసైడ్ మిషన్ కు స్విట్జర్లాండ్‌ చట్టబద్ధం చేయటం గమనించాల్సిన విషయం. దానికి కారణాలేమిటో కూడా తెలుసుకుందాం..

Read more : Minister Harish Rao : నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్.. 120 కొత్త వెంటిలేటర్లు

సార్కో అనే పేరు గల ఈ ‘సూసైడ్ మెషీన్’.. హైపోక్సియా, హైపోకాప్నియా (కణజాల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం, మరణానికి దారితీసే రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడం) ద్వారా నొప్పిలేకుండా మనుషులను చంపుతుంది. ఈ ఆత్మహత్య యంత్రంలోకి వెళ్లిన వ్యక్తి గ్లాస్ క్యాప్సూల్ లోపల ఆక్సిజన్ స్థాయిని కేవలం రెప్పపాటు కదలికలతో క్లిష్టమైన స్థాయికి తీసుకొస్తుంది. పక్షవాతం వల్ల కనురెప్పలు తప్ప మిగతా శరీర భాగాలేవీ కదిలించే లేని వ్యక్తులు కూడా ఈ మిషన్ లోకి వెళ్లి కేవలం నిమిష వ్యవధిలో ఏమాత్రం నొప్పిలేకుండా చనిపోవచ్చు. ప్రాణాల్ని కేవలం నిమిషాల వ్యవధిలోనే తీసేయగల ఈ మిషన్ ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

స్విట్జర్లాండ్‌లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు బతికి ఉండటం కంటే చనిపోవటమే మేలు అనేకునేవారు (మెర్సీ కిల్లింగ్) అంటే కారుణ్య మరణం ద్వారా చనిపోవాలని అనుకునేవారు ప్రభుత్వం నుంచి చాలా రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెడ్-డైయింగ్ కోసం డాక్టర్లను ఒప్పించి లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ తీసుకోవాలి. కానీ సూసైడ్ మెషీన్ తో ఎలాంటి సూదులు పొడిపించుకోకుండానే ప్రాణాలను శాంతంగా వదిలేయవచ్చు.అలాగే జీవితంలో ఇక నయంకావు అనుకునే రోగాలు ఉన్నవారు. వాటి బాధలు భరించలేక..తీవ్రమైన బాధతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న వారిని చట్టపరంగా చంపడాన్ని కారుణ్య మరణం లేదా యూథనేజియా/యూథనేష్యా (euthanasia) అని అంటారు. బాధ నివారణకు అమలు చేసే ఈ మెర్సీ కిల్లింగ్ (mercy killing) చాలా దేశాల్లో చట్టవిరుద్ధం.

Read more : UP Crime : మేక పెట్టిన చిచ్చు..రెండు హత్యలు..దోషులకు ఉరిశిక్ష

కానీ స్విట్జర్లాండ్‌ మాత్రం పూర్తి వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. ఒక నిమిషం కాలంలో నొప్పి లేకుండా మనుషులను చంపే ఓ యంత్రాన్ని ఈ సూసైడ్ మిషన్ కు స్విట్జర్లాండ్ చట్టబద్ధం చేసింది. శవపేటిక-ఆకారంలో ఉండే ఈ క్యాప్సూల్ ఒక నిమిషంలోనే నొప్పిలేకుండా, ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదిస్తుంది. ‘డాక్టర్ డెత్’ అని పేరొందిన డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే ఈ ఆత్మహత్య యంత్రాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నిట్ష్కే ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ గా ఉన్నారు. స్విట్జర్లాండ్‌లో సహాయక ఆత్మహత్య చట్టబద్ధం కాగా..2020లో సుమారు 1,300 మంది మెర్సీ కిల్లింగ్ సంస్థల సేవలను వినియోగించారు.