Job Mela : అపోలో హోమ్ హెల్త్ కేర్‌లో జాబ్స్.. రేపే జాబ్ మేళా.. కాంటాక్ట్ నెంబర్ ఇదే.. జీతం..

వైద్య రంగంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలకోసం వేచిచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. వికారాబాద్ జిల్లాలో జాబ్‌మేళా (Job Mela) నిర్వహించనున్నారు.

Job Mela : అపోలో హోమ్ హెల్త్ కేర్‌లో జాబ్స్.. రేపే జాబ్ మేళా.. కాంటాక్ట్ నెంబర్ ఇదే.. జీతం..

Job Mela

Updated On : August 20, 2025 / 7:08 AM IST

Job Mela : వైద్య రంగంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలకోసం వేచిచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. వికారాబాద్ జిల్లాలో జాబ్‌మేళా (Job Mela) నిర్వహించనున్నారు. 18ఏళ్ల నుంచి 40ఏళ్ల వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న పోస్టును బట్టి జీతం ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Mini Anganwadi : మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి.. టెన్త్ పాసైన వారికే.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ

అపోలో హోమ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హోమ్ కేర్ నర్సెస్, హోమ్‌కేర్ నర్సింగ్ అసిస్టెంట్స్, పేషెంట్ కేర్ అసిస్టెంట్స్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా (Job Mela) నిర్వహిస్తున్నారు.

ఈనెల 21వ తేదీన (గురువారం) ఉదయం 10.30 గంటలకు ఐటీఐ క్యాంపస్ ఆవరణలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పనాధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు.

ఈ జాబ్ మేళాలో మొత్తం 50కుపైగా పోస్టులు ఉన్నాయని తెలిపారు. జీడీఏ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చదివిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

పోస్టును బట్టి నెలకు రూ. 10వేల నుంచి రూ.40వేల వరకు వేతనం ఉంటుంది. ఈ జాబ్స్ అన్నీ హైదరాబాద్ లో ఉన్నాయని, పూర్తి వివరాలకు 9676047444 నెంబర్ లో సంప్రదించాలని షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు.