Nikhil Abburi : ప్రభాస్, నాగచైతన్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు నటుడిగా ఎంట్రీ.. ఈ బాబు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడండి..
నాగచైతన్య 100 % లవ్, ప్రభాస్ మిర్చి, రామ్ గణేష్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించాడు నిఖిల్ అబ్బూరి.(Nikhil Abburi)

Nikhil Abburi
Nikhil Abburi : చాల మంది చైల్డ్ ఆర్టిస్టులు తర్వాత నటీనటులుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమాల్లో హీరో హీరోయిన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా బిజీ అయ్యారు. తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ నటుడిగా మారాడు.(Nikhil Abburi)
నాగచైతన్య 100 % లవ్, ప్రభాస్ మిర్చి, రామ్ గణేష్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించాడు నిఖిల్ అబ్బూరి. చిన్నపుడు బొద్దుగా, ముద్దుగా క్యూట్ గా కనిపించి తన డైలాగ్స్ తో అలరించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి సైమా, నంది అవార్డులు కూడా గెలుచుకున్నాడు. పెద్దయ్యాక కూడా సినిమాల్లో స్థిరపడిపోదాం అని గత కొంతకాలంగా పలు విభాగాలలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.
నిఖిల్ అబ్బూరి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తో మరోసారి వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. #90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ నిర్వహించగా ఈ ఈవెంట్లో మౌళి.. నిఖిల్ అబ్బూరిని అందరికి పరిచయం చేసాడు. దీంతో నిఖిల్ ఇప్పుడు వైరల్ గా మారాడు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అనిల్ రావిపూడి కూడా ఇతన్ని చూసి నువ్వేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. మున్ముందు నిఖిల్ ఇంకా అనేక సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. హీరోగా కూడా మారాడతాడేమో చూడాలి.
Also Read : Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా నుంచి సాంగ్ రిలీజ్..