Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా నుంచి సాంగ్ రిలీజ్..
ఇప్పటికే ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా సినిమా నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు.(Chandrahas )

Chandrahas
Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ త్వరలో ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే సినిమాతో రాబోతున్నాడు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాణంలో సంపత్ రుద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుస్తుంది. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.(Chandrahas )
ఇప్పటికే బరాబర్ ప్రేమిస్తా సినిమా నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు. గుంజి గుంజి.. అనే సాంగ్ ని నిర్మాత బని వయసు చేతుల మీదుగా రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సాంగ్ ని వినేయండి..
ఈ ‘గుంజి గుంజి..’ అనే ఈ మాస్ సాంగ్ ని రోల్ రైడా రాయగా ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించి పాడారు. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు.
ఈ పాట రిలీజ్ చేసిన అనంతరం బన్నీ వాస్ మాట్లాడుతూ.. ధృవన్ మంచి సంగీతం ఇచ్చాడు. అతను నా సినిమాకు కూడా పనిచేస్తున్నాడు. చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా టైటిల్ తో పాటు ఈ సాంగ్ కూడా ఆసక్తిగా ఉంది అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Also Read : Prabhas Sisters : అమెరికా వెకేషన్ లో ప్రభాస్ పెద్దమ్మ& సిస్టర్స్.. ఫోటోలు చూశారా?