Asia cup 2025 : ఆసియా కప్ టోర్నీలో Ind vs Pak మ్యాచ్ జరుగుతుందా..? అగార్కర్ రియాక్షన్ ఇదే.. వెంటనే బీసీసీఐ ఎంట్రీ..
ఆసియా కప్ (Asia cup 2025) టోర్నమెంట్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ..

Asia Cup 2025
Asia cup 2025 : ఆసియా కప్ (Asia cup 2025) టోర్నమెంట్‌కు టీమిండియా సిద్ధమవుతుంది. మంగళవారం ఆసియా కప్‌లో ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మెగా టోర్నీలో భారత్ జట్టు తన ప్రత్యర్థి జట్లతో తలపడనుంది.
ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నమెంట్ యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ ఖండాంతర టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ -ఏ నుంచి భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్, హాంకాంగ్ జట్లు పోటీపడనున్నాయి.
ఈ టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న ఇండియా, పాకిస్థాన్ జట్లు ఈనెల 14న తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ జరిగే విషయంపై ఇంకా సందిగ్దత వీడలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ దేశంతో క్రీడల్లోనూ ఎలాంటి బంధం కొనసాగించవద్దనే డిమాండ్లు పెరిగాయి. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లోనూ ఇండియా చాంపియన్స్ జట్టు పాకిస్థాన్ జట్టుతో ఆడేందుకు విముఖత చూపింది. దీంతో లీగ్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లను బహిష్కరించి దేశమే తమకు ముఖ్యమని మాజీ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలోనూ పాకిస్థాన్ జట్టుతో భారత్ ఎలాంటి మ్యాచ్ ఆడొద్దన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరగాల్సిన పాకిస్థా వర్సెస్ భారత్ మ్యాచ్ జరిగే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మంగళవారం భారత జట్టు ప్రకటన అనంతరం టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ మీడియా మేనేజర్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ విలేఖరి.. సెప్టెంబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో మీ వైఖరి ఏమిటి.. అసలు మ్యాచ్ జరుగుతుందా..? అని అగార్కర్‌ను ప్రశ్నించారు. ఇందుకు అగార్కర్ బదులిచ్చేందుకు సిద్ధమవ్వగా.. వెంటనే బీసీసీఐ మీడియా మేనేజర్ ఎంట్రీ ఇచ్చారు.
ఆగండి.. కాస్త ఆగండి.. అంటూ అగార్కర్‌కు అడ్డుతగిలిన బీసీసీఐ మీడియా మేనేజర్.. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలు మాత్రమే అడగండి అంటూ మీడియాకు సూచించారు. దీంతో మరోసారి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.
ఆసియా కప్ షెడ్యూల్ ఇదే..
గ్రూప్ స్టేజ్..
సెప్టెంబర్ 9న – అఫ్గానిస్థాన్ వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 10న – భారత్ వర్సెస్ యూఏఈ
సెప్టెంబర్ 11న – బంగ్లాదేశ్ వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 12న – పాకిస్థాన్ వర్సెస్ ఒమన్
సెప్టెంబర్ 13న – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
సెప్టెంబర్ 14న భారత్ వర్సెస్ పాకిస్థాన్
సెప్టెంబర్ 15న – శ్రీలంక వర్సెస్ హాంకాంగ్
సెప్టెంబర్ 16న – బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గానిస్థాన్
సెప్టెంబర్ 17న – పాకిస్థాన్ వర్సెస్ యూఏఈ
సెప్టెంబర్ 18న – శ్రీలంక వర్సెస్ అఫ్గానిస్థాన్
సెప్టెంబర్ 19న – భారత్ వర్సెస్ ఒమన్
సూపర్ 4 మ్యాచ్‌లు..
సెప్టెంబర్ 20న – గ్రూప్ బి క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 21న – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 23న – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 24న – గ్రూప్ బి క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 25 న గ్రూప్ ఏ క్వాలిఫయర్ 2 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 2
సెప్టెంబర్ 26న – గ్రూప్ ఏ క్వాలిఫయర్ 1 వర్సెస్ గ్రూప్ బి క్వాలిఫయర్ 1
ఫైనల్..
సెప్టెంబర్ 28న – ఫైనల్ మ్యాచ్