UP Crime : మేక పెట్టిన చిచ్చు..రెండు హత్యలు..దోషులకు ఉరిశిక్ష

ఓ మేక పెట్టిన చిచ్చు రెండు హత్యలకు దారి తీసింది. 12 ఏళ్లపాటు విచారణ కొనసాగిన ఈకేసులో నిందుతులకు ఉరిశిక్షలు విధించింది కోర్టు.

UP Crime : మేక పెట్టిన చిచ్చు..రెండు హత్యలు..దోషులకు ఉరిశిక్ష

Man Stabs Two For Killing His Goat

Man stabs two for killing his goat : ఓ మేక పెట్టిన చిచ్చు కాస్తా రెండు హత్యలకు దారి తీసింది. ఈ కేసు విచారణ చేసిన కోర్టు సదరు నిందితుడు దోషిగా తేలటంతో ఉరిశిక్ష విధించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తన మేకను చంపేశారనే కోపంతో ఒక వ్యక్తి తన జనాలతో వెళ్లి పడిన గొడవకాస్తా ఘర్షణకుదారి తీసి రెండు హత్యలు చేసేదాకా వెళ్లింది. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది.

అది 2007, మార్చి నెల. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ జిల్లా పరిధి భికారిపూర్ గ్రామం. అక్లు చౌహాన్ అనే వ్యక్తి మేకల్ని పెంచుకునేవాడు. అతని మేకల్లో ఒక మేక మేత కోసం అదే గ్రామంలో ఉన్న రామ్ సనేహి అనే వ్యక్తి పొలంలోకి వెళ్లింది. మేత మేయటమే కాదు పంట కూడా నాశనం చేసింది. దీంతో రామ్ సనేహి మేకను..కొట్టాడు. ఆ దెబ్బలకు ఆ మేక చచ్చిపోయింది.

ఈ విషయం కాస్తా మేక యజమాని అక్లు చౌహాన్ కు తెలిసింది. కోపంగా రామ్ సనేహి వద్దకు తన బంధువులతో కలిసి వెళ్లాడు. అలా మాటా మాటా పెరిగింది. గొడవ పెద్దదైంది. తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కానీ అక్లు చౌహాన్ ఊరుకోలేదు. జనాలతో వచ్చి నాపై గొడవ పడతాడా? వాడి సంగతి చూస్తా అంటూ తన స్నేహితులు జైచంద్, రామ్ సారన్‌లను వెంటేసుకుని రాహ్ సనేహి వద్దకెళ్లి ముగ్గురూ కలిసి రామ్ సనేహిని కత్తులతో పొడిచి చంపేశారు. ఈక్రమంలో రామ్ సనేహిని కాపాడడానికి వచ్చిన పబ్బర్ అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు ఆ ముగ్గురు.

ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది అప్పట్లో. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఈ కేసు 2007నుంచి 12 ఏళ్లపాటు విచారణ కొనసాగి ఈనాటికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఏడుగురు.. కోర్టులో సాక్ష్యం చెప్పడంతో జిల్లా సెషన్స్ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది.