Gaming Bill : ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం.. డ్రీమ్ 11 వంటి గేమింగ్ యాప్‌లపై ప్రభావం ఉంటుందా? ఫుల్ డిటెయిల్స్..!

Gaming Bill : ఆన్‌లైన్ గేమింగ్‌ బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలో కొత్త చట్టంగా మారబోతుంది. డ్రీమ్ 11 సహా గేమింగ్ యాప్స్‌పై ప్రభావం ఉంటుందా?

Gaming Bill : ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం.. డ్రీమ్ 11 వంటి గేమింగ్ యాప్‌లపై ప్రభావం ఉంటుందా? ఫుల్ డిటెయిల్స్..!

Gaming Bill

Updated On : August 19, 2025 / 11:33 PM IST

Gaming Bill : దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం త్వరలో కఠినమైన చట్టాలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించే బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంగళవారం, కేంద్ర మంత్రివర్గం ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణకు సంబంధించి ముఖ్యమైన బిల్లును ఆమోదించింది.

ఈ బిల్లు కింద రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన నిషేధం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును తీసుకువస్తోంది. ఈ బిల్లును బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని వర్గాలు తెలిపాయి. కొత్త గేమింగ్ చట్టంతో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమకు పెద్ద దెబ్బ కావచ్చు.

ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అనేక మంది అప్పుల్లో మునిగిపోయారు. ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయి. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Read Also : Child Aadhaar Card : మీ పిల్లలకు 5 ఏళ్లు దాటాయా? UIDAI మెసేజ్ వచ్చిందా? బాల ఆధార్ అప్‌డేట్ చేయకపోతే జరిగేది ఇదే..!

అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బెట్టింగ్ వంటి అన్ని ఆన్‌లైన్ గేమింగ్‌లను నిషేధించబోతోంది. ఆన్‌లైన్ గేమ్ అది స్కిల్ లేదా ఏదైనా కావొచ్చు అన్నింటిని నిషేధించవచ్చు. ఆన్‌లైన్ గేమింగ్‌లో బెట్టింగ్‌ను నేరం కింద పరిగణిస్తారు. 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Gaming Bill : ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఏంటి? :

రియల్-మనీ గేమింగ్ యాప్ ప్రమోషన్ నిషేధించడం ద్వారా దేశంలో డిజిటల్ గేమింగ్ రంగానికి స్పష్టత తీసుకురావడమే ఈ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు లక్ష్యం. పీటీఐ ప్రకారం.. ఇలాంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించే లేదా నిర్వహించే వారికి జైలు సహా కఠినమైన జరిమానాలు ఉంటాయి. అదే సమయంలో ఇస్పోర్ట్స్, సాధారణ ఆన్‌లైన్ గేమ్‌ల నుంచి వేరు చేస్తుంది. ఆన్‌లైన్ మనీ గేమ్‌ దేనికి సంబంధించి అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

ఇలాంటివి నిషేధిస్తుంది :
ఆన్‌లైన్ మనీ గేమింగ్ సర్వీసులను అందిస్తోంది. ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లను ప్రకటించడం లేదా ప్రమోషన్ చేయడం. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా రియల్-మనీ గేమ్‌లకు సంబంధించిన ఫండ్స్ ప్రాసెస్ చేయడం లేదా ట్రాన్స్ ఫర్ చేయడం వంటివి నిషేధిస్తుంది.

శిక్షలు, జరిమానాలు :
రియల్-మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించే లేదా నిర్వహించే వారికి కఠినమైన శిక్షలు ఉండొచ్చు.
ఆన్‌లైన్ మనీ గేమ్‌ల నిర్వాహకులకు : 3ఏళ్ల వరకు వరకు జైలు శిక్ష/లేదా రూ. 1 కోటి వరకు జరిమానా.
యాడ్స్ లేదా ప్రమోషన్లు : రెండేళ్ల వరకు జైలు శిక్ష/లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా.
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో ఆర్థిక లావాదేవీలు : మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు/లేదా రూ. 1 కోటి వరకు జరిమానా.
పదే పదే నేరం చేసేవారికి : మూడు నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు.

Gaming Bill : గేమింగ్ బిల్లు ఎందుకంటే? :

భారత గేమింగ్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. లక్షలాది మంది ఆన్‌లైన్ ఆటలలో పోటీతత్వ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే, స్పష్టమైన నియంత్రణ చట్రం లేకపోవడం వల్ల ఈ గేమింగ్ రంగాన్ని గ్రే జోన్‌లో ఉంచారు. రాష్ట్రాలు గ్యాబ్లింగ్‌పై భిన్నమైన చట్టాలను అవలంబిస్తున్నాయి. రియల్-మనీ గేమింగ్‌పై ఆందోళనలు ఈ కారణాల వల్ల భారీగా పెరిగాయి

వ్యసనం : మితిమీరిన ఆటలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి.
మోసం : మోసపూరిత యాప్‌లు లేదా బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బాధితులు మోసపోయారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం : ఆర్థిక నష్టాల తరువాత నిరాశ, ఆత్మహత్యలకు పాల్పడటం
ఇలాంటి గేమ్స్ పాల్గొనే ఆటగాళ్లను ఈ బిల్లు నేరస్థులుగా పరిగణించదు. వినియోగదారులను నేరస్థులుగా కాకుండా వ్యసనం, బాధితులుగా పరిగణిస్తారు. ఈ కొత్త చట్టం ఆన్‌లైన్ జూదం ప్రమోటర్లును శిక్షిస్తుంది. సురక్షితమైన ఆన్‌లైన్ గేమింగ్, ఇ-స్పోర్ట్‌లను ప్రోత్సహించడం, గేమింగ్‌ ముసుగులో మోసాలను నివారించడమే ఈ బిల్లు ఉద్దేశం.

Read Also : Airtel Cheapest Plan : యూజర్లకు బిగ్ షాక్.. జియో బాటలో ఎయిర్‌టెల్.. రూ. 249 చీపెస్ట్ ప్లాన్ ఎత్తేస్తోంది.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

1400కి పైగా యాప్‌లు నిషేధం :
ఈ బిల్లు అమలులోకి వస్తే.. గేమ్ ఆడేందుకు ఎలాంటి రుసుము లేదా డబ్బు అవసరం లేని ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు మాత్రమే మనుగడ సాగిస్తాయి. ప్రభుత్వం చాలా ఏళ్లుగా బెట్టింగ్ యాప్‌లను నిషేధించడానికి ప్రయత్నిస్తోంది. గత నాలుగు-ఐదు సంవత్సరాలలో 1400 కంటే ఎక్కువ యాప్‌లను నిషేధించారు. ఇప్పటివరకూ ఎలాంటి చట్టం లేకపోవడం వల్ల, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లపై కచ్చితమైన చర్యలు తీసుకోలేదు.

డ్రీమ్ 11 వంటి గేమింగ్ యాప్‌లపై నిషేధం :
బిల్లు ప్రకారం.. ఆన్‌లైన్ గేమింగ్ కోసం లావాదేవీలు చేసేందుకు ఏ బ్యాంకుకు అనుమతి ఉండదు. ప్రస్తుతం, బెట్టింగ్ ప్రమేయం లేని అనేక ఆన్‌లైన్ గేమ్‌లు ఉన్నాయి. కానీ, వాటిని ఆడటానికి ముందు రుసుము చెల్లించాలి. దీనికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించాలి. క్రికెట్ జట్లను సృష్టించే డ్రీమ్ 11 వంటి గేమింగ్ యాప్‌లను కూడా నిషేధించవచ్చు.