Airtel Cheapest Plan : యూజర్లకు బిగ్ షాక్.. జియో బాటలో ఎయిర్‌టెల్.. రూ. 249 చీపెస్ట్ ప్లాన్ ఎత్తేస్తోంది.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ ఎత్తేస్తోంది. అత్యంత చౌకైన 1GB రోజువారీ డేటా ప్లాన్ ఇక కనిపించదు. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.

Airtel Cheapest Plan
Airtel Cheapest Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ నిలిచిపోనుంది. భారతీయ రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ రిలయన్స్ జియో బాటలో పయనిస్తోంది. ఇప్పటికే జియో పాటు రూ.249 ప్లాన్ తొలగించింది. ఎయిర్‌టెల్ కొద్దిగంటల్లో ఇదే ప్లాన్ తొలగించనుంది.
ఈ చీపెస్ట్ రీఛార్జ్ కావాలంటే ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవడం బెటర్. కానీ, రాత్రి 12 గంటల తర్వాత ఈ రూ. 249 ప్లాన్ కనిపించదు. జియో ఇప్పటికీ తన రిటైల్ స్టోర్‌లలో 1GB రోజువారీ డేటాతో రూ.209, రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నట్లు పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్ నుంచి బేస్ 1GB రోజువారీ డేటా ప్లాన్లను ఓసారి పరిశీలిద్దాం.
Airtel Cheapest Plan : భారతీ ఎయిర్‌టెల్ రూ. 249 ప్లాన్ :
ఎయిర్‌టెల్ అత్యంత చౌకైన 1GB రోజువారీ డేటా అందించే రూ.249 ప్లాన్ ఇదే. ఈ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇందులో ఫ్రీ హెలోట్యూన్స్, పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ఉన్నాయి. రూ.249 ప్లాన్ సర్వీస్ వ్యాలిడిటీ 24 రోజులు ఉంటుంది.
పెర్ప్లెక్సిటీ ప్రో AI సబ్‌స్క్రిప్షన్ జనవరి 2026 వరకు యాక్సస్ చేయొచ్చు. అప్పటివరకు యూజర్లు ఈ బెనిఫిట్స్ రీడీమ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ మరో కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 20, 2025న అర్ధరాత్రి 12 గంటలకు భారతీ ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ నిలిచిపోతుంది.
ఎయిర్‌టెల్ నుంచి కొత్త బేస్ 1GB రోజువారీ డేటా రూ. 299 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 1GB రోజువారీ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ సర్వీస్ వాలిడిటీ 28 రోజులు ఉంటుంది.
28 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో వచ్చే రూ.219 ప్లాన్‌తో వినియోగదారులు ఇప్పటికీ రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనిపై 3GB డేటాను పొందవచ్చు. ఇకపై ఎయిర్‌టెల్ యూజర్లు రూ. 249 ప్లాన్ పొందలేరు. టెల్కో ఈ రీఛార్జ్ ప్లాన్ ఎందుకు తొలగిస్తుందో తెలియదు. ఈ ప్లాన్ స్థానంలో వేరేదాన్ని తీసుకువస్తుందో లేదో కచ్చితంగా తెలియదు.