Honor X6e Launch : మంచి బడ్జెట్లో కొత్త ఫోన్ కావాలా? ఈ హానర్ 4G ఫోన్ ట్రై చేయండి.. ధర జస్ట్ ఎంతంటే?
Honor X6e Launch : హానర్ నుంచి అద్భుతమైన 4G ఫోన్ వచ్చేసింది. 50MP కెమెరా, 7500mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలివే..

Honor X6e Launch : హానర్ లవర్స్ మీకోసమే.. అద్భుతమైన ఫీచర్లతో హానర్ నుంచి సరికొత్త హానర్ X6e 4G కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్లో 7,500mAh బ్యాటరీ ఉంది. IP64 రేటింగ్ కూడా అందిస్తుంది. హానర్ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. కెమెరా, మెమరీ, ఇతర ఫీచర్లను ఓసారి వివరంగా పరిశీలిద్దాం..

హానర్ X6e 4జీ ధర :
కంపెనీ మలేషియా మార్కెట్లో హానర్ X6e 4జీ ఫోన్ లాంచ్ చేసింది. 4GB+128GB వేరియంట్ ధర RM 699 (సుమారుగా రూ. 16వేలు ఉంటుంది. ఈ ఫోన్‌ను మలేషియాలో కంపెనీ అధికారిక వెబ్సైట్, హానర్ మలేషియా నుంచి కొనేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను సన్‌రైజ్ గోల్డ్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు.

హానర్ X6e 4జీ స్పెసిఫికేషన్లు :
హానర్ X6e 4జీ ఫోన్ 6.61-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తుంది. 1604 × 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఎల్ సీడీ ప్యానెల్‌తో వస్తుంది. 16.7 మిలియన్ రంగులకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే అల్యూమినోసిలికేట్ గ్లాస్‌తో ప్రొటెక్షన్ అందిస్తుంది. మల్టీటచ్ ఇన్పుట్కు సపోర్టు ఇస్తుంది. ఈ డిస్ప్లేలో ఐ కంఫర్ట్, డైనమిక్ డిమ్మింగ్ ఫీచర్లు ఉన్నాయి.

హానర్ X6e 4జీ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ81 అల్ట్రా చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 4GB వరకు వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో మొత్తం ర్యామ్ 8జీబీ వరకు ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10.0తో వస్తుంది.

హానర్ X6e 4జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 10x వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేసే సెకండరీ కెమెరా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్లో ఎఫ్/2.2 అపర్చర్‌తో 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. 1920 × 1080 పిక్సెల్స్ వద్ద వీడియోను రికార్డ్ చేయొచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 7500mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. లి-అయాన్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. కంపెనీ 45W హానర్ సూపర్ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ కొలతలు 163.9 × 75.9 × 8.29mm, బరువు 207 గ్రాములు ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ కూడా అందిస్తుంది.
