Varun Tej : మరోసారి మంచి మనసును చాటుకున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.
Varun Tej Extends Financial Support to Fan Undergoing Tumour Treatment
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.
తన తల్లి పద్మజ సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడి, సురేష్ పాటిల్‌కు అత్యుత్తమ చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు, చికిత్స సమయంలో సురేష్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాలు కల్పించారు.
Pragya Jaiswal : బ్లూ, వైట్ షార్టు డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్.. ప్రగ్యాజైస్వాల్ ఫోటోలు వైరల్..
అంతేకాకుండా, చికిత్సకు అయ్యే మొత్తం వైద్య ఖర్చును వరుణ్ తేజ్ స్వయంగా భరించారు. సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అండగా నిలిచారని సన్నిహితులు తెలిపారు.

అభిమానులకు అండగా నిలవడం వరుణ్ తేజ్‌కు కొత్త విషయం కాదని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మృతిచెందినప్పుడు కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.
Neha Shetty : నేహా శెట్టి సమ్మర్ యూనిఫాం.. ఫోటోలు అదుర్స్..
మెగాస్టార్ చిరంజీవి సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని, అవసరమైన సమయంలో అభిమానులకు అండగా నిలుస్తున్న వరుణ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకోవడంతో అభిమానులు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.
