Child Aadhaar Card : మీ పిల్లలకు 5 ఏళ్లు దాటాయా? UIDAI మెసేజ్ వచ్చిందా? బాల ఆధార్ అప్‌డేట్ చేయకపోతే జరిగేది ఇదే..!
Child Aadhaar Card : మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే మీ పిల్లలకు ఇంకా ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయించకపోతే వెంటనే చేయించండి.

Child Aadhaar Card
Child Aadhaar Card : మీ పిల్లలకు ఐదేళ్లు దాటాయా? బాల ఆధార్ అప్‌డేట్ చేశారా? లేదా? ఐదేళ్లు దాటిన పిల్లలకు వెంటనే ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలంటూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మెసేజ్‌లు పంపుతోంది. ఐదేళ్లు దాటి 15ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు సంబంధించి కూడా యూఐడీఏఐ మెసేజ్ పంపుతోంది.
మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే మీ పిల్లలకు ఇంకా ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయించకపోతే వెంటనే చేయించండి. లేదంటే బాల ఆధార్ డీయాక్టివేట్ అవుతుంది. ఇంతకీ బాల ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలి? ఏయే డాక్యుమెంట్లు కావాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Child Aadhaar Card : 1. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఏంటి? :
పిల్లలకు జారీ చేసే బాల ఆధార్ కార్డును 5ఏళ్లు దాటాక బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి. ఒకవేళ 5ఏళ్లకు ముందుగానే ఆధార్ కార్డు తీసుకుని ఉంటే ఐదేళ్లు దాటిన వెంటనే ఆధార్ కార్డును మళ్లీ అప్ డేట్ చేయించుకోవాలి. మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్(MBU) అనేది ఫస్ట్ బయోమెట్రిక్ అప్‌డేట్.
ఈ సమయంలో పిల్లలకు సంబంధించి పూర్తి బయో డేటాను అందించాలి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వివరాలను నింపాలి. బాల ఆధార్ నంబర్ మారదు. కేవలం వివరాలు మాత్రమే మారతాయి. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పక చేయించుకోవాల్సిందే.
2. బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకంటే? :
శిశువుల నుంచి 5ఏళ్ల పిల్లలకు జారీ చేసే ఆధార్ కార్డునే బాల ఆధార్ అని పిలుస్తారు. పిల్లల ఫొటో, పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వివరాలు మాత్రమే ఉంటాయి. ఈ బాల ఆధార్ కోసం పిల్లల ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ బయోమెట్రిక్ తీసుకోరు. ఆ సమయంలో పిల్లలకు సరిగా వేలిముద్రలు తయారుకావు. 5ఏళ్ల తర్వాత వేలిముద్రలు, ఐరిస్ సరిగా కనిపిస్తాయి.. అందుకే ఈ వయస్సులో బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయించుకోవాలని UIDAI సూచిస్తోంది.
3. యూఐడీఏఐ పంపిన మెసేజ్ ఏంటి? :
5ఏళ్లు దాటిన చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరి. ఆధార్ డీయాక్టివేషన్ కాకుండా ఉండాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లి వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని UIDAI మెసేజ్‌లలో తల్లిదండ్రులకు సూచిస్తుంది.
4. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎక్కడంటే? :
మీకు దగ్గరలోని ఏదైనా ఆధార్ సెంటర్ కానీ ఆధార్ సర్వీసు సెంటర్లకు వెళ్లి పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తి చేసుకోవచ్చు.
5. ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? :
మీ పిల్లల ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయని పక్షంలో వారి నెంబరు తాత్కాలికంగా డీయాక్టివేట్ అయిపోతుంది. 5ఏళ్లు దాటిన పిల్లలకు ఆధార్ అప్‌డేట్ రెండేళ్లలోపు చేయాలి. లేదంటే 7ఏళ్లు నిండేలోగా చేయడం బెటర్.
ఒకవేళ అలా చేయకపోతే ఆధార్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం ఆధార్ నంబర్ ఆటో డీయాక్టివేట్ అయిపోతుంది. మీ సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి యూఐడీఏఐ పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు కూడా పంపుతుంది.
6. ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ రుసుము ఎంత? :
7ఏళ్ల లోపు పిల్లల ఆధార్ అప్‌డేట్ ఫ్రీగా చేయొచ్చు. ఆపై చిన్నారుల ఆధార్ అప్‌డేట్ కోసం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 7ఏళ్లు దాటితే పిల్లల ఆధార్ అప్‌డేట్ కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.
7. పిల్లల ఆధార్ డీయాక్టివేట్ అయితే పరిస్థితి ఏంటి? :
ఆధార్ నిబంధనల ప్రకారం.. బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకపోతే ఆధార్ నెంబర్ అలానే ఉంటుంది. కానీ, కార్డు టెంపరరీగా డీయాక్టివేట్ చేస్తారు. బయెమెట్రిక్ అప్‌డేట్ అయ్యేవరకు అలానే ఉంటుంది. పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయిస్తే వెంటనే యాక్టివేట్ అయిపోతుంది. ఆధార్ పోర్టల్‌లో నంబర్ ద్వారా పిల్లల ఆధార్ యాక్టివేట్ ఉందో లేదో చెక్ చేయొచ్చు.
8. పిల్లల ఆధార్ అప్‌డేట్ కోసం ఏం చేయాలంటే? :
ఫస్ట్ టైం ఆధార్ తీసుకుంటే పిల్లల బర్త్ సర్టిఫికెట్ అవసరం. తల్లిదండ్రుల్లో ఒకరిది ఆధార్ కార్డు ఉండాలి. 5ఏళ్ల లోపు పిల్లలకు కోసం ఆధార్ తీసుకుంటే వారిని ఆధార్ సెంటర్ల వద్దకు అవసరం లేదు. బయోమెట్రిక్ సమయంలో మాత్రం తప్పనిసరిగా తీసుకురావాలి. ఎందుకంటే అప్పుడు వారి ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫొటోతో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
9. ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకంటే? :
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నింటికి తప్పనిసరి. పోటీపరీక్షలు, స్కాలర్‌షిప్, DBT స్కీమ్ సేవలు, స్కూల్ అడ్మిషన్ల కోసం ఆధార్ ఉండాల్సిందే. ఈ సేవలను పొందాలంటే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడం ముఖ్యం.
10. పిల్లల ఆధార్ ఎన్ని ఏళ్లకు అప్‌డేట్ చేయాలి? :
సాధారణంగా పిల్లల ఆధార్ కార్డును 5ఏళ్లకు ఒకసారి అప్‌డేట్ చేస్తారు. 15 ఏళ్ల తర్వాత కూడా అప్‌డేట్ చేయాలి. 15 ఏళ్ల నుంచి 17ఏళ్ల లోపు పిల్లలకు ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయొచ్చు. ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్, ఫేస్ ఫోటోను అప్‌డేట్ చేయాలి.