RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు
రజినీ అభిమానులు మాత్రం ఈ వార్తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం రజినీకాంత్ కు ఈ కష్టాలేంటని తమ బాధను సోషల్ మీడియాలో..
- Paramesh V
- Published on- January 18, 2022 / 09:53 AM IST
Rajinikanth Dhanush Aishwarya
RajiniKanth : సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, తమిళ్ స్టార్ హీరో ధనుష్ విడిపోయిన వార్త మూవీ లవర్స్ కు షాకిచ్చింది. ట్విట్టర్ లో ధనుష్.. ఇన్ స్టాలో ఐశ్వర్య తాము విడిపోయిన వార్తను పంచుకున్నారు. తమకు ప్రైవసీ కావాలని.. కొంత టైం కావాలని.. అభిమానులకు అర్థం చేసుకోవాలని వేడుకున్నారు.
ఐశ్వర్య- ధనుష్ విడాకుల సంగతి అటుంచితే.. రజినీ అభిమానులు మాత్రం ఈ వార్తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ ఆరాధ్య దైవం రజినీకాంత్ కు ఈ కష్టాలేంటని తమ బాధను సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టుల రూపంలో వెళ్లగక్కుతున్నారు.
Read More : Dhanush Aishwaryaa : షాకింగ్.. రజనీ కూతురు ఐశ్వర్య, ధనుష్ విడాకులు
ధైర్యంగా ఉండు తలైవా అని కొందరు రజినీ అభిమానులు కామెంట్ చేశారు. రజినీతో ధనుష్ సంతోషంగా కలిసి ఉన్న ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆనందం ఇక అనవసరం అని కొందరు అంటున్నారు. మనిషిగా ఎంతో పాజిటివిటీని రజినీకాంత్ సంపాదించుకున్నారనీ.. ఐతే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం నెగెటివ్స్ తప్పడం లేదని ఇంకొందరు ఆవేదన వ్యక్తంచేశారు. రజినీకే ఇన్ని ఎదురుదెబ్బలు ఎందుకు తగులుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రజినీ ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తుంటారని.. ఆయనకు దేవుడు ధైర్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
చిన్నకూతురు సౌందర్య విడాకులు మరిచిపోకముందే.. పెద్ద కూతురు భర్తతో విడిపోవడం తండ్రిగా రజినీకాంత్ ను ఇబ్బంది పెట్టే సమస్యన్నారు కొందరు నెటిజన్లు.
Being #Rajinikanth is not Easy!
ఇద్దరు విడాకులు తీసుకున్న కూతుళ్లకు తండ్రిగా, రాజకీయాలు- సినిమా-జీవితం-వ్యక్తిగతం-సమాజ సేవ అంశాలను బ్యాలెన్స్ చేస్తున్న రజినీకాంత్ లా ఉండడం మరెవరికీ సాధ్యం కాదనేది మరికొందరు అభిప్రాయం.
అందరికంటే ఆ జంటకు పుట్టిన ఇద్దరు కొడుకులు ఎక్కువ బాధపడతారని ఓ నెటిజన్ అన్నాడు.
Read This : Siri Hanumanthu : బిగ్బాస్ సిరికి కరోనా పాజిటివ్
