Rajya Sabha: బుధవారం అవమానం, గురువారం వెనక్కి.. బిహార్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. ‘‘ఇక చాలు ఆపండి. మీరు చెప్పినట్లుగా చేస్తే దేశం మరో బిహార్‌లా మారుతుంది’’ అని అన్నారు
- tony bekkal
- Published on- December 22, 2022 / 04:13 PM IST
Piyush Goyal withdraws remark on Bihar
Rajya Sabha: అలా చేస్తే దేశం మొత్తం బిహార్‌లా మారిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ వెనక్కి తీసుకున్నారు. తనకు ఎవరినీ కించ పరిచే ఉద్దేశం లేదని, బిహార్ ప్రజలను తక్కువ చేయాలనే ఉద్దేశంతో అలా వ్యాఖ్యానించలేదని ఆయన సమాధానం చెప్పారు. గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన అనంతరమే బుధావారం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి ముందు పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా మండిపడ్డారు. ఈ విషయమై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కడ్కు లేఖ రాశారు.
Parliament: పార్లమెంటులో మళ్ళీ మాస్కులు పెట్టుకుని కనపడ్డ ఓం బిర్లా, ధన్‌కర్, మోదీ
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. ‘‘ఇక చాలు ఆపండి. మీరు చెప్పినట్లుగా చేస్తే దేశం మరో బిహార్‌లా మారుతుంది’’ అని అన్నారు. దీంతో బిహార్‌ను బిహారీలను అవమానించారంటూ మనోజ్ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాయడంతో పాటు గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో జేడీయూ, ఆర్జేడీ ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగారు.
Karnataka: బెళగావికి చేరిన లింగాయత్‌ల ఆందోళన.. బీజేపీతో ఢీ అంటే ఢీ
అనంతరం గురువారం సభ ప్రారంభం కాగానే, పీయూష్ గోయెల్ ఈ విషయమై స్పందిస్తూ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘బీహార్‌ను కానీ బీహార్ ప్రజలను కానీ అవమానించే ఉద్దేశం ఎంతమాత్రమే లేదని నేను స్పష్టం చేస్తున్నాను. వారినే కాదు దేశంలో ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదు. అయినప్పటికీ నా వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించినట్లయితే, ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడే ఉపసంహరించుకుంటున్నాను. ఇది ఎవరిపైనా ద్వేషంతోనో చేసిన వ్యాఖ్యలు కాదని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను’’ అని అన్నారు.
