Rakhi Sawant: రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు సూపర్ ఐడియా చెప్పిన బాలీవుడ్ నటి రాఖీ సావంత్
ముందు టొమాటో ధరల పెరుగుదల గురించి రాఖీ సావంత్ మాట్లాడింది. టమాటా ధరలు పెరుగుతున్న తీరును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తన ఇంట్లో టమాటా మొక్కను తానే పెంచుకోవాలని, వాటి నుంచి టమోటాలు తెంపుకుని తినాలని రాఖీ చెప్పింది.
- tony bekkal
- Published On : July 11, 2023 / 05:05 PM IST
Rahul Gandhi: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం అనే విషయంపై రాజకీయ వ్యూహకర్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ బాలీవుడ్ బోల్డ్ బేబీ రాఖీ సావంత్ ఒక చక్కని ఉపాయం చెప్పింది. ఏం లేదు.. రాహుల్ ఒక్కసారి బిగ్ బాస్‌కు వెళ్తే సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందట. తరుచూ ఏదో ఒక అంశంపై వార్తల్లో ఉండే రాఖీ.. ఈసారి రాహుల్ గాంధీకి రాజకీయ మంత్రం చెప్పింది.
Sundaram Master Teaser : సుందరం మాస్టర్ మొదటి క్లాస్ మొదలైంది.. హాజరయిన సెలబ్రిటీ స్టూడెంట్స్..
తను చెప్పిన ఈ మంత్రం కనుక పాటిస్తే కాంగ్రెస్ పార్టీకి ఘన విజయమే అంటోంది రాఖీ. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో రాఖీ సావంత్ మాట్లాడుతూ 2024 లోక్‌సభను గెలవడానికి రాహుల్ గాంధీకి మంత్రం ఇచ్చింది. రాహుల్ గాంధీ బిగ్ బాస్‌లోకి వస్తే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పింది. బిగ్ బాస్ ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుందని, రాహుల్ జీవితాన్ని కూడా మార్చేస్తుందని ఆమె అభిప్రాయపడింది.
राखी सावंत ने राहुल गांधी को दिया 2024 लोकसभा जीतने का मंत्र
कहा, “अगर आप बिग बॉस में जाएंगे तो चुनाव जीत जाएंगे”
Rakhi Sawant | #RakhiSawant | Bigg Boss #Sachtaknews pic.twitter.com/XmTbdX7MrG
— SACH TAK NEWS (@SachTakNo1) July 11, 2023
దీనికి ముందు టొమాటో ధరల పెరుగుదల గురించి రాఖీ సావంత్ మాట్లాడింది. టమాటా ధరలు పెరుగుతున్న తీరును దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తన ఇంట్లో టమాటా మొక్కను తానే పెంచుకోవాలని, వాటి నుంచి టమోటాలు తెంపుకుని తినాలని రాఖీ చెప్పింది. అంతకు ముందు మరొక వీడియోలో.. వర్షం పడుతుండగా తల మీద గుడ్లు కొట్టుకుని ‘ఒక మంచి వరుడు కావాలి’ అని కోరుకుంది.
