×
Ad

RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. వరుసగా ఊరిస్తూ వచ్చి ఇప్పుడిలా.. లోన్లు తీసుకునే వారికి నిరాశే

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

RBI

  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన
  • ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
  • ప్రస్తుతం 5.25 శాతంగా కీలక వడ్డీ రేట్లు
  • లోన్లు తీసుకునే వారికి నిరాశే!

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

Also Read : Samsung Galaxy S24 FE : శాంసంగ్ లవర్స్ డోంట్ మిస్.. శాంసంగ్ గెలాక్సీ S24 FEపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

గత కొంతకాలంగా ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన క్రమంలో బ్యాంకుల్లో కూడా వడ్డీ రేట్లు దిగొచ్చిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం నిరాశే ఎదురైంది. ఈసారి ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ వేయడం గమనార్హం.

సాధారణంగా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తే దానికి అనుగుణంగా బ్యాంకులు కూడా హోం లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్ ఇలా రెపో రేటుకు లింక్ అయి ఉండే లోన్ వడ్డీ రేట్లు తగ్గిస్తుంటాయి. దీంతో ప్లోటింగ్ రేటుపై లోన్లు తీసుకున్న వారికి లోన్ ఈఎంఐ లేదా టెన్యూర్ తగ్గించుకునేందుకు వీలుంటుంది. ఇంకా కొత్తగా లోన్లు తీసుకునే వారికి తక్కువ వడ్డీకే లోన్లు అందుబాటులోకి వస్తాయి.

గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్‌లో 5.5శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్ లో వందవ వంతుకు సమానం. డిసెంబర్ పాలసీ సమావేశంలో ఎంసీపీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిన్ పాయింట్లు తగ్గించి 5.5శాతం నుంచి 5.25 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది.

ఆర్బీఐ తాజా నిర్ణయంతో లోన్లు తీసుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. వరుసగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చాయి కాబట్టి.. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటు స్థిరంగా ఉంచిన నేపథ్యంలో.. బ్యాంకులు కొత్తగా ఇచ్చే లోన్ వడ్డీ రేట్లు కాస్త పెంచే అవకాశం ఉంది. బ్యాంకులు ఇలాంటి సమయాల్లో తమ అంతర్గత నిధుల వ్యయం లేదా ఇతర మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్లను పెంచే నిర్ణయం కూడా తీసుకోవచ్చు. కాబట్టి.. కొత్తగా లోన్లు తీసుకునే వారికి బ్యాంకులు.. తమ నిబంధనల్ని బట్టి రేట్లను మార్చే అవకాశం ఉంటుంది.