Aiims : ఎయిమ్స్ లో జూనియర్ రెసిడెంట్ల భర్తీ
రాతపరీక్ష, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధులకు డిసెంబరు 22 వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- Guntupalli Ramakrishna
- Published On : December 11, 2021 / 03:33 PM IST
Aiims Bhopal
Aiims : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత పనిలో అనుభవం అర్హతగా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు30 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్ధులకు జీతభత్యాలుగా నెలకు రూ.56,100 చెల్లిస్తారు
రాతపరీక్ష, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధులకు డిసెంబరు 22 వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక మెడికల్ కాలేజీ బిల్డింగ్, ఎయిమ్స్, భోపాల్(ఎంపీ)-462020 జరగనుంది.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్,ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.aiimsbhopal.edu.in/సంప్రదించగలరు.
