Sabarimala: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న కేరళ.. డ్రోన్స్ తో ప్రత్యేక నిఘా.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

శబరిమల(Sabarimala) తీర్థయాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ అధికారులు రహదారుల మరమ్మతులు, పటిష్ట భద్రతను చేపట్టారు.

Sabarimala pilgrimage preparations in full swing idukki collector orders strict arrangements

Sabarimala: శబరిమల మండల-మకరవిళక్కు తీర్థయాత్రా కాలం త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా సన్నాహక చర్యలు చేపట్టారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాతీయ రహదారుల అథారిటీ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మండల సీజన్ ప్రారంభమయ్యే లోపే సైన్‌బోర్డుల ఏర్పాటుతో సహా రహదారుల పనులన్నింటినీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ దినేసన్ చెరువుత్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.

Gollapalli Reservoir Tragedy: పెనుకొండలో ఘోర విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మహిళలు మృతి

ఆరోగ్య పరీక్షలు, అదనపు సేవా కేంద్రాల ఏర్పాటు:

ప్రధాన మార్గాలైన వలడి, సత్రం, పుల్లుమేడు ప్రాంతాల్లో అటవీ శాఖ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో తగినన్ని మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. సత్రం మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం వలడి వద్ద ఆరోగ్య పరీక్షా (Sabarimala) కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ప్రత్యామ్నాయ సలహాలు అందించనున్నారు. అదనంగా పుల్లుమేడు, జీరో పాయింట్, కళుతక్కుళి వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో-షాప్‌లను ప్రారంభించి తాగునీరు, అల్పాహారాలు అందించనున్నారు.

పటిష్టమైన భద్రత.. 24 గంటల పర్యవేక్షణ:

మార్గమధ్యలో భద్రత కోసం ప్రతి 500 మీటర్లకు ఇద్దరు ఎకో-గార్డులను, డ్రోన్ నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. మోటారు వాహనాల శాఖ ఆధ్వర్యంలో ఆరు బృందాలు 24 గంటలూ గస్తీ కాయడమే కాకుండా ఉప్పుతారలో తాగునీరు, అగ్నిమాపక సేవలను సిద్ధం చేశారు. కుమిలి వద్ద ఎక్సైజ్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి మత్తు పదార్థాల రవాణాను కట్టడి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.