Chikkaballapur Sister Brother Marriage : పెళ్లికి ముందు ఇంటి నుంచి పరార్.. కట్ చేస్తే తమ్ముడిని వివాహం చేసుకున్న అక్క.. ఆపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి
Chikkaballapur Sister Brother Marriage : సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఒకటి వెలుగు చూసింది. అక్క, తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది.
- Dharani Pilli
- Updated on- May 8, 2026 / 09:58 PM IST
sister and brother love marriage at chikkaballapur in karnataka
Chikkaballapur Siblings Marriage : సమాజంలో రోజు రోజుకు విలువలు దిగజారిపోతున్నాయి. వావివరసలు మరిచి.. జంతువులు కన్నా హీనంగా ప్రవర్తించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా సభ్య సమాజం సిగ్గుతో ఉరేసుకుని చవాల్సిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. సాధారణంగా తమ్ముడిని కొడుకుగా ప్రేమగా చూసుకుంటుంది అక్క. తమ్ముడు కూడా అక్కలో అమ్మను చూసుకుంటాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అక్క, తమ్ముడు మాత్రం కామంతో కళ్లు మూసుకుపోయి.. లవర్స్ గా మారారు. ఇంతకన్నా దరిద్రమైన అంశం ఏంటంటే వీరి చండాలం గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయించారు. గంటలో పెళ్లి అనగా తమ్ముడితో పరారయ్యింది. గుడిలో వివాహం చేసుకున్న వీరు.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ జుగుప్సకరమైన అంశం తెర మీదకు వచ్చింది.
కట్టుబాట్లకు విరుద్ధమైన సంఘటన కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దేవనహళ్లికి చెందిన శశికళకు హోసకోటలో నివసించే తన పెద్దమ్మ కుమారుడు ప్రవీణ్‌తో మంచి అనుబంధం ఉండేది. రోజులు గడుస్తున్న కొద్ది అది కాస్త ప్రేమగా మారింది. అయితే, వీరిద్దరూ రక్తసంబంధీకులు (వరుసకు అక్కాతమ్ముళ్లు) కావడంతో వీరి బంధాన్ని ఇరు వైపుల తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా శశికళ, ప్రవీణ్ తల్లులు ఇద్దరు అక్కాచెల్లెల్లు కావడంతో గమనార్హం.
వీరిద్దరి విరుద్ధమైన ప్రేమ గురించి తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. ముహూర్తం నిశ్చయించి.. శుభలేఖలు ప్రింట్ చేసి బంధుమిత్రులకు ఆహ్వానించారు. అయితే అమ్మ, చిన్నమ్మ తమ ప్రేమను అడ్డుకుంటున్నారని భావించిన శశికళ.. పెళ్లికి ముందు ఇంటి నుంచి పారిపోయి ప్రవీణ్ ని కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ స్థానిక అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత నేరుగా చిక్ బళ్లాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. తమ లవ్ స్టోరి చెప్పి.. తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.
వీరి విచిత్ర ప్రేమ కథ విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. చేసేదేం లేక.. ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వరుసకు అక్కాతమ్ములయ్యే వారు ఇలా పెళ్లి చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
