Kejriwal at Gujarat: బీజేపీలోనే ఉండండి, కానీ ఆప్ కోసం పని చేయండి: కేజ్రీవాల్ పిలుపు
మా పార్టీలోకి బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువగా వచ్చేవారు ఉన్నారు. కానీ వారిని ఆపుతున్నారు. ఆప్‌లోకి రావాలనుకుని రాలేకపోతున్న బీజేపీ కార్యకర్తలకు నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను. మీరు బీజేపీలోనే ఉండండి. వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి. కానీ ఆప్ కోసం పని చేయండి. ఎందుకంటే మీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు
- tony bekkal
- Published On : September 3, 2022 / 04:17 PM IST
Stay in BJP but work for AAP says Kejriwal
Kejriwal at Gujarat: భారతీయ జనతా పార్టీలో ఉండి, ఆ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేయండని గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజరాత్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించారు. ఇందులో భాగంగా రెండవ రోజు రాజ్‌కోట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.
‘‘మాకు బీజేపీ నుంచి లీడర్లు అక్కర్లేదు. లీడర్లను బీజేపీనే ఉంచుకొమ్మనండి. కానీ మా పార్టీలోకి బీజేపీ కార్యకర్తలు వస్తున్నారు. ఇంకా చాలా ఎక్కువగా వచ్చేవారు ఉన్నారు. కానీ వారిని ఆపుతున్నారు. ఆప్‌లోకి రావాలనుకుని రాలేకపోతున్న బీజేపీ కార్యకర్తలకు నేను ఒక విషయం చెప్పదల్చుకున్నాను. మీరు బీజేపీలోనే ఉండండి. వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి. కానీ ఆప్ కోసం పని చేయండి. ఎందుకంటే మీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మేము నెరవేరుస్తాం. మేం అధికారంలోకి రాగానే గుజరాత్‌లోని ప్రతి ఇంటికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తాం. నాణ్యమైన విద్య, ఆరోగ్యం ఉచితంగా అందిస్తాం. బీజేపీ ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించిందా? ప్రజలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన వీటిని మేము ఇస్తుంటే అడ్డుకోవాలని బీజేపీ చూస్తోంది’’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Massive Eviction: అస్సాంలో భారీ ఎత్తున చేపట్టిన తొలగింపు కార్యక్రమం.. నీడ కోల్పోతున్న 299 కుటుంబాలు
