Massive Eviction: అస్సాంలో భారీ ఎత్తున చేపట్టిన తొలగింపు కార్యక్రమం.. నీడ కోల్పోతున్న 299 కుటుంబాలు

ఖాళీ చేయకుండా అక్కడే నివాసం ఉంటున్న కొందరు తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్నామని.. ఇళ్లు, ఉపాధి, కూడు లేకుండా పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేయిస్తున్న ప్రదేశాన్ని మూడు విభాగాలుగా విభజించి పనులు ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు ఈ పని ప్రారంభం కాగా, ఉదయం 9 గంటల నాటికే మూడింటిలో ఒక వంతు పూర్తైందట

Massive Eviction: అస్సాంలో భారీ ఎత్తున చేపట్టిన తొలగింపు కార్యక్రమం.. నీడ కోల్పోతున్న 299 కుటుంబాలు

Massive eviction drive underway in Assam

Massive Eviction: అస్సాంలోని సోనిత్‭పూర్ జిల్లాలో పెద్ద ఎత్తున తొలగింపు కార్యక్రమం చేపట్టారు. సుమారు 50 ఎక్స్‭కేవేటర్లు, ఇతర భారీ యంత్రాలు, పెద్ద ఎత్తున కార్మికులతో మొత్తం 330 ఎకరాల విస్తీర్ణాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి అలజడి రేగకుండా ఉండేందుకు 1,200 మంది బలగాలను మోహరించారు. బ్రహ్మపుత్ర నదికి ఉత్తరాన ఉన్న ఒడ్డున ఇంత పెద్ద డ్రైవ్ కొనసాగుతోంది.

ఈ డ్రైవ్ చేపట్టిన ప్రాంతంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 299 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాజా పరిస్థితుల కారణంగా వీరంతా నీడ కోల్పోతున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యే లేదని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి నోటీసులు అందగానే 90 శాతం మంది అక్కడి నుంచి ఖాళీ చేశారని అధికారులు చెప్పారు.

Melting Himalayas ..Pakistan Floods : రికార్డు స్థాయిలో హిమాలయాలో కరిగిపోవటం వల్లే పాకిస్థాన్‌లో వరదలు వచ్చాయంటున్న పరిశోధకులు

దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్న వీరు.. నాగోన్, మారిగోన్ జిల్లాల నుంచి వలస వచ్చిన వారట. వీరిలో అత్యధికులు బెంగాలీ మాట్లాడే ముస్లింలు. ఆ తర్వాత బెంగాలీ హిందువులు, గూర్ఖాలు ఉన్నట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు. చాలా మంది ఎనిమిదిల నెలల క్రితమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారట. అయితే మిగిలిన వారికి రిహాబిలిటేషన్ సౌలభ్యం లేక ఆగిపోయారని అంటున్నారు.

కాగా, ఖాళీ చేయకుండా అక్కడే నివాసం ఉంటున్న కొందరు తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్నామని.. ఇళ్లు, ఉపాధి, కూడు లేకుండా పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేయిస్తున్న ప్రదేశాన్ని మూడు విభాగాలుగా విభజించి పనులు ప్రారంభించారు. ఉదయం 5 గంటలకు ఈ పని ప్రారంభం కాగా, ఉదయం 9 గంటల నాటికే మూడింటిలో ఒక వంతు పూర్తైందట. ఈ సాయంత్రానికి మొత్తం పని పూర్తవుతుందని అంటున్నారు.

Sushil Modi: జేడీయూ-ఆర్జేడీ కూటమిని విచ్ఛిన్నం చేస్తాం.. సుశీల్ మోదీ సంచలన వ్యాఖ్యలు