Melting Himalayas ..Pakistan Floods : రికార్డు స్థాయిలో హిమాలయాలో కరిగిపోవటం వల్లే పాకిస్థాన్‌లో వరదలు వచ్చాయంటున్న పరిశోధకులు

కిస్థాన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు విరుచుపడుతున్నాయి. పాక్ లో ఈ అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం కూడా కారణం అని చెబుతున్నారు పరిశోధకులు. హిమాలయాల్లో మంచు ఫలకాలు రికార్డు స్థాయిలో కరిగిపోయాయని 15 ఏళ్లుగా హిమాలయాల్లో మంచుపై పరిశోధనలు ఇండోర్‌ ఐఐటీ బృందం గుర్తించింది.

Melting Himalayas ..Pakistan Floods : రికార్డు స్థాయిలో హిమాలయాలో కరిగిపోవటం వల్లే పాకిస్థాన్‌లో వరదలు వచ్చాయంటున్న పరిశోధకులు

melting Himalayas.. Pakistan Floods

melting Himalayas.. Pakistan Floods : పాకిస్థాన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు విరుచుపడుతున్నాయి. పాక్ లో ఈ అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం కూడా కారణం అని చెబుతున్నారు పరిశోధకులు. హిమాలయాల్లో మంచు ఫలకాలు రికార్డు స్థాయిలో కరిగిపోయాయని 15 ఏళ్లుగా హిమాలయాల్లో మంచుపై పరిశోధనలు ఇండోర్‌ ఐఐటీ బృందం గుర్తించింది. ఈ వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హిమఫలకాలు భారీగా కరిగాయని చెబుతోందీ పరిశోధకులు బృందం. దీంతో పాకిస్థాన్ లో వరదలు ముంచెత్తాయని చెబుతోంది.

గత మార్చి..ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను అధిగమించాయి.. ఫలితంగా మంచు ఫలకాలు రికార్డు స్థాయిలో కరిగిపోయాయి. హిమాలయాల్లో రికార్డు స్థాయిలో మంచు కరగటాన్ని గమనించామని గతం వారంగా హిమాలయాల్లోనే ఉన్న ఐఐటీ పరిశోధకుల బృందంలోని గ్లేసియాలజిస్టు మహమ్మద్‌ ఫరూఖ్‌ ఆజమ్‌ తెలిపారు.పాకిస్థాన్‌లో అతి తీవ్ర స్థాయిలో వర్షాలు పడి ఓ పక్క నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు హిమాలయాలపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మంచు ఫలకాలు కరిగి ఆ నీరు పాకిస్థాన్‌ వైపు ప్రమాదకర స్థాయిలో ప్రవహించి వచ్చి చేరుతోంది. ఫలితంగా పాక్ ని ముంచెత్తిన వరదలు లక్షలాదిమంది నష్టపోయారు. లక్షల హెక్టార్లలో పొలాలు నీటమునిగాయి. 20 డ్యామ్‌లపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది.

ఈ సారి ఒక్క హిమాలయాల్లోనే మాత్రమే మంచు కరగలేదు. ఐరోపాలోని ఆల్ఫ్స్‌ పర్వతాలపై కూడా ఇలానే మంచుఫలకాలు కరుగుతున్నాయి. కాకపోతే ఉత్తర, దక్షిణ ధ్రువాల తర్వాత అత్యధికంగా మంచినీరు గడ్డకట్టి ఉండే ప్రాంతం హిమాలయాలే. 2021లో ఐఐటీ ఇండోర్‌ బృందం కొన్ని ప్రమాద సంకేతాలను గుర్తించింది. ఈ శతాబ్దం మొత్తం ఇక్కడ ఇదే విధంగా మంచు కరిగితే భవిష్యత్తులో నీటి కరవు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.వేడెక్కుతున్న అరేబియా సముద్రం, లా నినా ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. హిమాలయ హిమానీనదం కరిగిపోయే ప్రభావం.. పాక్‌ భూభాగంలో ఉన్న 7,000 హిమానీనదాలపై ప్రభావాన్ని చూపెట్టనుందని అంటున్నారు.

ఆ వెంటనే మరొకటి వరదల రూపంలో మహా ప్రళయం ముంచెత్తి.. పాక్‌ను ఎంత డ్యామేజ్‌ చేస్తుందో తెలియదు. కానీ..ఆ తర్వాత తీవ్రమైన కరువు కచ్చితంగా పాక్‌ను మరింతగా దిగజారస్తుంది అని హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదవ దుర్బలమైన(హాని పొందే అవకాశం ఉన్న) దేశం. అలాంటి భూభాగంలో.. వాతావరణ మార్పులతో వరదలు, కరువు వెనువెంటనే సంభవించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.హిమాచల్‌ ప్రదేశ్‌లో హిమాలయాలపై ఛోటా షిగ్రీ గ్లేసియర్‌పై అధ్యయనంలో భాగంగా.. గత 15 ఏళ్లుగా పరిస్థితులను ఆధారంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు ఇండోర్‌ ఐఐటీ సైంటిస్టులు. ఈ మార్పులు ఎంతగా ఉన్నాయంటే..హిమానీనదం కరిగిన ప్రభావంతో.. పరిశోధనా కేంద్రం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఈ పరిశోధనా కేంద్రాన్ని జూన్‌లో ఏర్పాటు చేస్తే.. ఆగస్టులో వరదలకు నామరూపాలు లేకుండా పోయింది.

గ్లోబల్‌ వార్మింగ్‌.. ఊహించని స్థాయిలో వడ గాల్పుల ప్రభావం యూరప్‌ ఆల్ఫ్స్‌తో పాటు హిమాలయ పరిధిలోని మంచును సైతం కరిగించేస్తోంది. అయితే హిమాలయాల్లో గ్లేసియర్లు సైంటిస్టుల ఊహకంటే దారుణంగా కరిగిపోతున్నాయి. ఈ ప్రభావం పాకిస్థాన్ పైనే ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే నగరాలు, పంటపొలాలతో సహా అంతా ముగినిపోగా.. రాబోయే విపత్తులను తల్చుకుని పాక్‌ ప్రజలు వణికిపోతున్నారు.హిమాలయాల నీరు.. ఎనిమిది దేశాలు.. 1.3 బిలియన్ల ప్రజలకు తాగు-సాగు నీటిని అందిస్తోంది. టిబెట్‌ నుంచి మొదలయ్యే సింధు నదీ పరీవాహక ప్రాంతం.. పాక్‌ గుండా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది ఫ్రాన్స్‌ కంటే రెండింతల పరిమాణంలో ఉండి.. పాక్‌కు 90 శాతం ఆహారోత్పత్తులను అందిస్తోంది. కాగా పాకిస్థాన్ వరదల ప్రభావానికి 1000మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. తినటానికి తిండి..తాగటానికి నీరు లేక పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు.