Viral Video : వాలంటైన్స్ డే రోజు ఈ వింత చూసారా? ఈ ఆవుకి రంగేసి..
ప్రేమికుల రోజున సోషల్ మీడియా ప్రేమ పోస్టులతో నిండిపోయింది. వాటి మధ్య వింతగా.. వినూత్నంగా నిలిచింది ఓ వీడియో.
- Lakshmi 10tv
- Published On : February 14, 2024 / 06:47 PM IST
Viral Video
Viral Video : వాలంటైన్స్ డే రోజు ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేమ పక్షులు షేర్ చేసుకున్న వీడియోలు చూసాం. ఒక వింత వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆవుకి రంగేసి మరీ.. అదేంటి అనుకుంటున్నారా? చదవండి.
Nayanthara : మరోసారి ప్రేమలో పడిన నయనతార.. వాలంటైన్స్ డే నాడు ఆసక్తికర పోస్ట్..
రోజుకో థీమ్‌తో వాలంటైన్స్ డే వీక్‌ను సూపర్‌గా సెలబ్రేట్ చేసుకున్న ప్రేమికులంతా వాలంటైన్స్ డే రోజును అంతకు మించి అన్నట్లు జరుపుకున్నారు. ఇక సోషల్ మీడియా అయితే ప్రేమతో నిండిపోయింది. ప్రపోజ్ చేస్తూ.. గిఫ్ట్‌లు ఇస్తూ రకరకాల సెలబ్రేషన్ వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. అయితే ఒక వీడియో మాత్రం చాలా ప్రత్యేకంగా.. వింతగా అనిపించింది. ఒక ఆవును దాని యజమాని తాడుతో కట్టి తీసుకెళ్తున్నాడు. అందులో ఏముంది? అనుకోకండి.. అందులోనే అంతా ఉంది.
Adavallu Meeku Joharlu: శర్వా – రష్మిక ఫ్యాన్స్‌కు వాలంటైన్స్ డే ట్రీట్.. ఓ మై ఆద్యా..!
ఆవు ముందు రెండు కాళ్లపై ఓ స్త్రీ మూర్తి బొమ్మను.. వెనుక కాళ్లపై పురుషుడి బొమ్మను వేసారు. పురుషుడు పూల గుత్తిని స్త్రీకి ఇస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఆవు నడుస్తూ వెళ్తుంటే .. పురుషుడు పూల గుత్తిని ఆ స్త్రీకి ఇవ్వడానికి వెనుకే వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అంటే అతను తన ప్రేమను వ్యక్తం చేయాలని ఆరాటపడుతున్నాడన్నమాట. ఈ వీడియో చేసిన వారిని.. ఆర్టిస్ట్ క్రియేటివిటీని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రేమికుల రోజు సందర్భంలో ఎన్నో వీడియోల మధ్య ఈ వీడియో ప్రత్యేకంగా నిలిచింది.
How long did this take? pic.twitter.com/6emdBrnulu
— Real Untold Story (@RealUntoldStory) February 14, 2024
