×
Ad

Success Story: టీ అమ్మే వ్యక్తి కొడుకు సక్సెస్ స్టోరీ.. పేదరికాన్ని జయించి ఐఏఎస్ ఆఫీసర్ అయిన వైనం

చిన్న టీ దుకాణం ద్వారా దేశల్ డాన్ చరణ్ తండ్రి తన కుటుంబాన్ని పోషించారు. ఎంత కష్టపడైనా పిల్లలను బాగా చదివించాలని చరణ్ తండ్రి దృఢంగా నిశ్చయించుకున్నారు.

  • Published On : February 25, 2026 / 05:49 PM IST

Deshal Dan Charan Representative Image (Image Credit To Original Source)

  • సంకల్పం, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు
  • పేదరికాన్ని జయించి అద్భుత విజయం
  • ఐఏఎస్ ఆఫీసర్ అయిన నిరుపేద, టీ విక్రేత కొడుకు

Success Story: సంకల్పం, లక్ష్యం, కృషి, పట్టుదల, శ్రమించే తత్వం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం కూడా మన విజయాన్ని అడ్డుకోలేదు. ఇది పలుమార్లు నిరూపితమైంది. తాజాగా మరోసారి ప్రూవ్ అయ్యింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యుడు, టీ అమ్మే వ్యక్తి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఆయన సక్సెస్ స్టోరీ ఇప్పుడు అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచింది. నేటి యువతకు మార్గనిర్దేశనం చేస్తోంది.

రాజస్థాన్‌కు చెందిన దేశల్ దాన్ చరణ్ నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చారు. ఒక లక్ష్యం, సంకల్పం, కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించొచ్చని చెప్పేందుకు ఆయన విజయగాథ ఒక రుజువు. IIT JEE పరీక్షతో పాటు UPSC CSE కూడా ఉత్తీర్ణుడయ్యారు చరణ్. UPSC, IIT JEE పరీక్షలు రెండూ దేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్షలు. IIT ద్వారా అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం పొందొచ్చు. సివిల్ సర్వీసెస్ ద్వారా IAS, IPS, IFS, IRS ఇతర పోస్టుల్లో నియమితులవుతారు.

దేశల్ డాన్ చరణ్ రాజస్థాన్‌లోని సుమలై గ్రామంలోని ఒక నిరు పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కుశాల్ డాన్ చరణ్ ఒక చిన్న దుకాణం నడుపుతూ టీ అమ్ముతారు. ఈ చిన్న టీ దుకాణం ద్వారా దేశల్ డాన్ చరణ్ తండ్రి తన కుటుంబాన్ని (10 మంది) పోషించగలిగారు. ఎంత కష్టపడైనా సరే పిల్లలను బాగా చదివించాలని చరణ్ తండ్రి దృఢంగా నిశ్చయించుకున్నారు.

పిల్లల చదువు కోసం అప్పులు చేసిన తండ్రి..

చదువు విజయానికి కీలకమని కుశాల్ డాన్ చరణ్ బలంగా నమ్మారు. అందుకే పని చేయమని పిల్లలపై ఏనాడు ఆయన ఒత్తిడి చేయలేదు. అయితే, చిన్న టీ దుకాణంతో వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. దాంతో ఆయన తన పిల్లల చదువు కోసం అప్పులు కూడా చేయాల్సి వచ్చింది.

చరణ్ ఏడుగురు తోబుట్టువులు భారత నావికాదళంలో చేరారు. అయితే చరణ్ పెద్ద సోదరుడు జలాంతర్గామి ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో చరణ్ 10వ తరగతి చదువుతున్నారు. ఈ సంఘటన కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. చరణ్ ఇంజనీర్ కావాలని కోరుకున్నారు. JEE మెయిన్ పరీక్షకు సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులతో పరీక్షను క్లియర్ చేశారు. IIIT జబల్ పూర్‌లో చదువుకున్నారు.

తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. అయితే IAS అధికారి కావాలనే ఆయన కల నెరవేరలేదు. పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత.. ఐఏఎస్ పరీక్షకు సిద్ధం కావడానికి ఢిల్లీకి మకాం మార్చారు. తనకు ఎక్కువ సమయం లేదని ఆయనకి తెలుసు. అందుకే పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి చదివారు. అనుకున్నది సాధించారు. UPSC CSE పరీక్షను క్లియర్ చేశారు. 2017లో UPSC CSE పరీక్షను ఆల్ ఇండియా 82 ర్యాంక్‌తో క్లియర్ చేసి IAS అధికారి అయ్యారు.

Also Read: పెళ్లిలో దారుణం.. అందరి ముందే పెళ్లి కూతురిని కాల్చిన ప్రియుడు.. వీడియో వైరల్