Super El Nino India : సూపర్‌ ఎల్‌నినో ముప్పు.. వచ్చే మార్చి నాటికి భారత్‌లో 55వేల మరణాలు..!

Super El Nino India : అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన కొత్త ట్రాకర్ ప్రకారం.. 2026 అక్టోబర్ నెల నుంచి 2027 మార్చి నెల మధ్య కాలంలో భారతదేశంలో వేడి తీవ్రత కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 55వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని, వీటిలో ఎక్కువ మరణాలు మార్చి నెలలోనే చోటు చేసుకునే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

Super El Niño effect

Super El Niño India : ఎల్‌నినో రూపంలో భారతదేశంలో మరో వాతావరణ ముప్పు పొంచి ఉందా? రాబోయే ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కారణంగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Also Read : Karuunaa Bhushan : ప‌ల్లెటూరి అమ్మాయిలా క‌రుణా భూష‌ణ్.. ఫోటోలు వైర‌ల్..

అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ రూపొందించిన కొత్త ట్రాకర్ ప్రకారం.. 2026 అక్టోబర్ నెల నుంచి 2027 మార్చి నెల మధ్య కాలంలో భారతదేశంలో వేడి తీవ్రత కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 55వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని, వీటిలో ఎక్కువ మరణాలు మార్చి నెలలోనే చోటు చేసుకునే ప్రమాదం ఉందని అంచనా వేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. వచ్చే ఆరు నెలల కాలంలో ఎల్‌నినోకు సంబంధించిన తీవ్రమైన వేడి కారణంగా 8.57 లక్షల అదనపు మరణాలు సంభవించవచ్చని అంచనా వేసింది.

క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ రూపొందించిన ఎల్‌నినో హీట్‌ మోర్టాలిటీ ట్రాకర్‌ అంచనాల ప్రకారం.. 2026 అక్టోబర్‌ నుంచి 2027 మార్చి వరకు వివిధ దేశాల్లో అదనపు వేడి సంబంధిత మరణాల అంచనాలను పరిశీలిస్తే.. నైజీరియా (సుమారు 56,000), భారత్‌ (సుమారు 55,000), ఇండోనేషియా (సుమారు 29,000), బ్రెజిల్‌ (సుమారు 19,000) ఎక్కువగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ట్రాకర్ పేర్కొంది.

తీవ్రమైన వేడి వల్ల వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, ఎండలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వేడి నుంచి రక్షణ కోసం ముందస్తు హెచ్చరికలు, తాగునీటి సదుపాయాలు, చల్లదనం కల్పించే కేంద్రాలు, ఆరోగ్య సేవలను విస్తరించడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. వాతావరణ అంచనాలు, ఉష్ణోగ్రతలు, మరణాల మధ్య గతంలో నమోదైన వివరాల ఆధారంగా ప్రస్తుత పరిణామాలతో రూపొందించిన నమూనా అంచనా మాత్రమే. వాస్తవ ప్రాణనష్టం వాతావరణ పరిస్థితులు, స్థానిక రక్షణ చర్యలు, ప్రజల అనుకూలత సామర్థ్యంపై ఆధారపడి మార్పులు ఉండొచ్చు.