×
Ad

CJI Justice NV Ramana : శాసన వ్యవస్థపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

భారత్‌ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలన్నారు. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ... 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రజాస్వామ్యం అంశంపై ప్రసంగించారు.

  • Published On : July 17, 2022 / 08:26 AM IST

Cji Nv Ramana

CJI Justice NV Ramana : శాసన వ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన వ్యవస్థ పనితీరులో నాణ్యత క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు శతృత్వంగా మారకూడదని, రాజకీయ వైరం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య పరస్పర గౌరడం ఉండేదని… కానీ ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య దూరం పెరగడం దురదృష్టకరమని సీజేఐ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

భారత్‌ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని మనం గమనించాలన్నారు. దేశ బహుళత్వాన్ని కాపాడుకోవడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఒక మార్గమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీరమణ… 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రజాస్వామ్యం అంశంపై ప్రసంగించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు పేరుకుపోవ‌డంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్యలు చేశారు.

CJI Justice NV Ramana : న్యాయవ్యవస్థలో దేశానికే తెలంగాణ ఆదర్శం : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

న్యాయ‌ వ్యవ‌స్ధలో ఖాళీల భ‌ర్తీ చేప‌ట్టక‌పోవ‌డంతోనే కేసులు ప‌రిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయ‌ని కేంద్ర ప్రభుత్వానికి చుర‌క‌లు వేశారు. న్యాయ‌మూర్తులుగా తాము విదేశాల‌కు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటార‌ని, ఓ కేసును ప‌రిష్కరించేందుకు ఎన్నేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అడుగుతుంటార‌ని చెప్పుకొచ్చారు. పెండింగ్ కేసుల‌కు కార‌ణ‌మేంటో మీ అంద‌రికీ తెలుస‌ని, దానిపై తాను స‌వివ‌రంగా చెప్పాల్సిన ప‌నిలేద‌ని అన్నారు.

ప్రభుత్వం ఖాళీల భ‌ర్తీ, కోర్టుల్లో మౌలిక వ‌స‌తుల మెరుగుద‌ల‌పై దృష్టి సారించాల‌ని కోరారు. జ్యుడిషియ‌ల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ఏర్పాటు చేయాల‌ని తాము సూచించామ‌ని, అయితే ఈ ప్రతిపాద‌న ఇంకా కార్యరూపానికి రాలేద‌ని అన్నారు.