స‌హ‌జీవ‌నం.. అత్యాచారం స‌మానం కాదు

సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

  • Publish Date - January 3, 2019 / 06:40 AM IST

సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: సహజీవనంలో ఉన్న పురుషుడు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన భాగస్వామిని వివాహమాడని పక్షంలో వారి మధ్య భౌతిక సంబంధం రేప్‌తో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రకు చెందిన నర్సు ఓ డాక్టర్‌పై పెట్టిన కేసును కొట్టివేస్తూ అత్యున్నత ధర్మాసనం పైవిధంగా స్పందించింది.  మ‌హిళ‌ను వివాహం చేసుకోలేని పక్షంలో లివ్-ఇన్ పార్టనర్ల మధ్య సానుకూల భౌతిక సంబంధాలు అత్యాచారం కింద‌కు రావ‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. న‌ర్సు భర్త చనిపోయిన అనంత‌రం ఆమె డాక్టర్‌తో ప్రేమలో పడింది.

కొన్నాళ్లుగా ఇద్ద‌రూ సహజీవనం సాగిస్తున్నారని కోర్టు దృష్టికి వ‌చ్చింది. ‘రేప్‌కు, పరస్పర అంగీకార శృంగారానికి చాలా తేడా ఉంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఫిర్యాదుకు వచ్చిన వ్యక్తిని   స‌ద‌రు వ్య‌క్తి నిజంగానే వివాహం చేసుకోవాలనుకున్నాడా? లేదా అతనికి ఏదైనా దురుద్దేశం ఉందా? అని చాలా ర‌కాలుగా పరిశీలించాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. న‌ర్సు అతనితో ఇష్ట‌పూర్వ‌కంగా శృంగారంలో పాల్గొంటే వారి మధ్య సంబంధాన్ని రేప్‌గా పరిగణించలేం అని జ‌స్టిస్ ఏకే సిక్రీ  ఎస్.అబ్దుల్ నజీర్ తో కూడిన‌  ధర్మాసనం ఇటీవలి తీర్పులో వెల్ల‌డించింది. 

ట్రెండింగ్ వార్తలు