ఎన్నికల వేళ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్.. ఎలక్టోరల్ బాండ్స్ స్కీంపై సంచలన తీర్పు

ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు..

supreme court

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్స్ స్కీంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రో కోకు దారి తీస్తాయని తెలిపింది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచడం తగదని చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని తెలిపింది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.

ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు నిలిపేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ బాండ్స్ కొన్నవారి వివరాలను ఈసీకి సమర్పించాలని ఆదేశించింది. మార్చి 31లోపు ఎన్నికల కమిషన్ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వైబ్ సైట్ లో ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పింది.

ఎలక్ట్రోరల్ బాండ్స్ విధానం సమాచార హక్కు ఉల్లంఘన కిందికే వస్తుందని తెలిపింది. ఎలక్టోరల్ బాండ్స్ చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒకటే మార్గం కాదని, ఇతర అనేక మార్గాలు కూడా ఉన్నాయని తెలిపింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ తీర్పుపై కీలకంగా మారింది.

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఈ కేసుపై విచారణ కొనసాగించింది. అన్ని పక్షాల వాదనలను విన్నాక తీర్పును రిజర్వు చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని 2018, జనవరి 2న ఈ పథకాన్ని కేంద్ర సర్కారు నోటిఫై చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు అర్హత కలిగి ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలంటే ఆ పార్టీలకు గత లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు వచ్చి ఉండాలన్న నిబంధన ఉంది. ఎలక్టోరల్ బాండ్‌ల ద్వారా గత ఆరున్నర ఏళ్లలో రూ.9,188 కోట్లకు పైగా విరాళాలను ఆయా పార్టీలు సేకరించాయని అంచనా. అందులో అత్యధికంగా లబ్ధిపొందింది బీజేపీ.

ఎన్నికల వ్యవస్థపై ప్రభావం: ప్రశాంత్ భూషణ్
ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేస్తూ.. ఎన్నికల వ్యవస్థపై ప్రభావం చూపే కీలక తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. వార్షిక లాభాల్లో ఏడున్నర శాతం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వొచ్చన్న నిబంధనను తొలగిస్తూ.. ఎంతైనా విరాళం ఇచ్చేలా కంపెనీస్ యాక్ట్ సవరణలను తేవడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఎస్బిఐ ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాలని.. ఎన్నికల కమిషన్ ఏ పార్టీకి ఎన్ని విరాళాలు ఎవరి ద్వారా వచ్చాయో వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు.


TDP: 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి.. ఏపీ రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ నిష్క్రమణ.. పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు