West Bengal CM Oath Ceremony : బెంగాల్‌లో కొలువుదీరిన బీజేపీ సర్కార్.. సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన మోదీ, చంద్రబాబు
Suvendu Adhikari West Bengal CM Oath Ceremony : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు.
- Harish Thanniru
- Updated on- May 9, 2026 / 03:54 PM IST
Suvendu Adhikari Oath Taking Ceremony In West Bengal Modi And Chandrababu Naidu Attended
Bengal CM Suvendu Adhikari Oath: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్.రవి సీఎంగా సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
Also Read : Tamil Nadu Politics : తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. హుటాహుటీన హైదరాబాద్ ఎమ్మెల్యేలు..
గతంలో సువేందు అధికారి మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. మమతతో విబేధాల కారణంగా 2020లో టీఎంసీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బెంగాల్‌లో బీజేపీ బలోపేతానికి సువేందు కీలక భూమిక పోషించారు. తాజాగా.. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయనతోపాటు బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ మంత్రులుగా ప్రమాణం చేశారు.
