Barber Brothers from Punjab: తాజ్‌మహల్ నుంచి మైకెల్ జాక్సన్ ఫేస్ వరకూ స్పెషల్ హెయిర్ కట్స్
పంజాబ్ కు చెందిన ఇద్దరు బార్బర్ బ్రదర్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ.. ఆర్టిస్టికల్ హెయిర్ కట్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు.
- Subhan Ali Shaik
- Published On : October 20, 2021 / 12:26 PM IST
Hair Cuts
Barber Brothers from Punjab: పంజాబ్ కు చెందిన ఇద్దరు బార్బర్ బ్రదర్స్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ.. ఆర్టిస్టికల్ హెయిర్ కట్స్ తో ఆశ్చర్యపరుస్తున్నారు. పంజాబ్ లోని దబ్వాలీకి చెందిన రాజ్వీందర్ సింగ్ సిద్ధూ (29), గుర్వీందర్ సింగ్ సిద్దూ (31)లు కస్టమర్లకు సుందరమైన హెయిర్ కట్స్ తో మెప్పిస్తున్నారు.
కస్టమర్ల ఛాయీస్ మేరకు తాజ్ మహల్ నుంచి మైకెల్ జాక్సన్ వరకూ అందరి బొమ్మలను తలలపైనే చెక్కేస్తున్నారు. వారి ఆయుధాలు ట్రిమ్మర్, కత్తెరలు, పెన్సిల్స్ మాత్రమే. వీటితోనే పర్ఫెక్ట్ ఇమేజ్ సెట్ చేస్తున్నారు.
స్టార్టింగ్ లో మేం ఇలా వేయించుకునే వారికి ఫ్రీగా చేసి పంపించేవాళ్లం. ఎందుకంటే ముందుగా మాకూ ప్రాక్టీస్ గా ఉంటుందని ఫీల్ అయ్యేవాళ్లం. ఒక్కోసారి రాత్రి 2గంటల వరకూ ప్రాక్టీస్ చేసే వాళ్లం. ఇప్పుడు రెగ్యూలర్ గా సెలూన్ నడుపుతుండటంతో డిజైన్ ను బట్టి రూ.1500 నుంచి రూ.2వేల 200వరకూ ఛార్జ్ చేస్తున్నాం. అని చెప్తూనే విదేశాల్లో కూడా వ్యాపారం ఓపెన్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
……………………………………….: జ్యూస్ లతో ఐరన్ లోపాన్ని అధిగమించండిలా!..
బాలీవుడ్ యాక్టర్లు, పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ల బొమ్మలు వేయాలని కూడా రిక్వెస్ట్ లు వస్తున్నాయట. ఒకరు కార్టూన్ క్యారెక్టర్ మిక్కీ మౌజ్ అడిగితే.. మరొకరు మైకెల్ జాక్సన్, తాజ్ మహల్ లాంటివి అడుగుతుంటే సంతృప్తికరంగా వేసి పంపుతున్నారట. తన తలపై సుందరమైన తాజ్ మహల్ బొమ్మ చూపించుకునేందుకు తహతహలాడుతున్నానని చెప్పుకొచ్చాడు.
