TN CM Vijay Astrologer: జ్యోతిష్యుడికి కీలక పదవి.. సీఎం విజయ్ తీసుకొచ్చి ఏకంగా..
దివంగత ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీలకు కూడా తానే ఇష్టమైన జ్యోతిష్యుడినని ఆయన పేర్కొన్నారు.
- Naveen
- Updated on- May 12, 2026 / 07:08 PM IST
TN CM Vijay Astrologer: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సీఎం విజయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం జ్యోతిష్యుడికి కీలక పదవి అప్పగించడమే. విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రి OSD (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ-పొలిటికల్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాధన్ దివంగత సీఎం జయలలితకు కూడా జ్యోతిషుడిగా ఉన్నారు.
రాధన్.. విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడిగా, ఆధ్యాత్మిక సలహాదారుడిగా ప్రసిద్ధి చెందారు. తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రాధన్ తనను తాను “రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యుడి”గా అభివర్ణించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, బీజేపీ నాయకుడు ఎల్.కె. అద్వానీలకు కూడా తానే ఇష్టమైన జ్యోతిష్యుడినని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఈ వ్యవహారంలో సీఎం విజయ్ పై విమర్శలు వస్తున్నాయి. జ్యోతిషుడికి ప్రభుత్వంలో చోటివ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. టీవీకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ అధికారంలోకి వస్తారని సంవత్సరం క్రితమే జోస్యం చెప్పింది ఈయనే. రాజకీయ వర్గాల్లో విజయ్‌తో సంబంధం ఉన్న జ్యోతిష్యుడిగా రికీ రాధన్ పండిట్‌కు విస్తృతంగా పేరుంది. ఇటీవలి సంవత్సరాలలో కీలకమైన రాజకీయ, వ్యక్తిగత కార్యక్రమాలలో నటుడు-రాజకీయవేత్త అయిన విజయ్‌తో పాటు ఆయన కనిపించారని సమాచారం.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన రాజకీయ, పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు విజయ్ చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓఎస్డీ పదవిలో సాధారణంగా రాజకీయ సమన్వయం, సంప్రదింపుల పని, ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా సంబంధించిన పనులను నిర్వహించడం వంటివి ఉంటాయి.
తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకేయేతర తొలి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు విజయ్. మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: మొదటిసారి గెలవగానే బెంగాల్ మహిళకు బీజేపీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్..
TVK spokesperson Rickey Radhan Pandit Vettrivel appointed as Officer on Special Duty (OSD) to Tamil Nadu Chief Minister pic.twitter.com/Gn81Py9sSu
— ANI (@ANI) May 12, 2026
