Tamil Nadu Exit Polls 2026 : తమిళనాడులో గెలిచేదెవరు.. పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది..? అందరిచూపు ఎగ్జిట్ పోల్స్ వైపు..
Tamil Nadu Exit Polls 2026 : తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది. అయితే, గురువారం జరిగిన పోలింగ్ సరళి ఎవరికి అనుకూలిస్తుందనే అంశంపై ప్రస్తుతం అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
- Harishth Thanniru
- Updated on- April 23, 2026 / 03:34 PM IST
Tamil Nadu Elections 2026 Exit Poll Release Date And Time
Tamil Nadu Exit Polls 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటన్నింటిలో ఒకే విడతలో గురువారం పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య పోటీ నెలకొంది. అయితే, ఈ ఎన్నికల్లో మొత్తం 4,023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గురువారం జరిగిన పోలింగ్ లో అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తును నిర్వహించారు. తద్వారా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ప్రస్తుతం అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ పైకి మళ్లింది.
Also Read : తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేసిన సినీ ప్రముఖులు.. ఫొటో గ్యాలరీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ప్రధాన పోటీ ఉండేది.. ప్రస్తుతం సీనీ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించడంతోపాటు.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ తరపున అభ్యర్థులను బరిలో నిలిపాడు. అంతేకాక.. విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశం తమిళనాడులోనేకాక దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. అయితే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏప్రిల్ 29వ తేదీన సాయంత్రం 6.30గంటలకు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరగనుంది.
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనల ప్రకారం.. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం నిషేధం. ఎందుకంటే.. తమిళనాడుతోపాటు పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దశ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతాయి. ఆ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ ఈనెల 29వ తేదీన జరుగుతుంది. దీంతో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో 29వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడుసహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.
