Polling Percentage : తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. పోలింగ్ శాతం ఎంతంటే
Polling Percentage : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంతంటే..
- Dharani Pilli
- Updated on- April 23, 2026 / 03:48 PM IST
Tamil nadu west bengal assembly elections 2026 polling percentage
- తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో పోలింగ్
- ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్
- మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా పోలింగ్
Polling Percentage : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో తొలి విడత పోలింగ్ లో భాగంగా నేడు 152 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఏప్రిల్ 23, గురువారం ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తమిళనాడు రాజధాని చెన్నైలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, నటుడు, రాజకీయ నాయకుడు విజయ్, ప్రముఖ నటులు అజిత్, సూర్యలతో పాటు ఇతర సెలబ్రిటీలు ఆయా పోలింగ్ బూత్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ బూత్‌ల లోపల కూడా సందడి నెలకొంది. బూత్‌ల వెలుపల అభిమానులు కేకలు వేస్తుండటంతో, కొందరు వారితో ఫోటోలకు ఫోజులిచ్చారు.
వేసవి కాలం కావడంతో తమిళనాట అంతా తీవ్రమైన ఉక్కపోతతో పాటు ఎండలు మండిపోతున్నాయి. అయినా సరే ప్రజలు వేడిని సైతం లెక్క చేయక ఓటు వేయడానికి క్యూ కడుతున్నారు. ఈసారి పోలింగ్ ప్రారంభం నుండే ఓటింగ్ వేగంగా జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా నేడు ఇరు రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సుమారుగా ఉన్న ఓటింగ్ సరళి ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 56.81 శాతం ఓట్లు నమోదయ్యాయి.
తిరుప్పూర్, ఈరోడ్, కరూర్, నామక్కల్, సేలం జిల్లాల్లో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. చెన్నైలోని అనేక నియోజకవర్గాల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ (తొలివిడత)లో ఉదయం 11 గంటల ప్రాంతం వరకు 41.11 శాతం ఓటింగ్ నమోదైంది.
