Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం.. దీపావళి బోనస్ – తమిళి సై
వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం, దీపావళి బోనస్ ఇస్తామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
- kunduru Vinod
- Updated on- September 17, 2021 / 11:26 AM IST
Salary
Salary : తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆమె పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరిస్తూ, అందరూ టీకా వేసుకోవాలన్న నినాదంతో పుదుచ్చేరిలో వైమానిక దళానికి చెందిన సైనికులు చేపట్టిన ర్యాలీని తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ప్రారంభించారు.
Read More : Corona : భౌతిక దూరం 6 అడుగులు సరిపోదు..!
అనంతరం మాట్లాడుతూ కరోనా టీకా తీసుకుంటేనే జీతం, దీపావళి రాయితీలు ఇస్తామని ప్రకటించారు. టీకా తీసుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. రెండు డోసుల టీకా తీసుకున్నవారు కరోనా బారినపడిన వెంటనే కోలుకుంటున్నారని తెలిపారు. కుటుంబాన్ని, చుట్టూ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు విధిగా టీకా తీసుకోవాలని సూచించారు.
Read More : Prince Philip వీలునామాకు సీల్ వేసిన కోర్టు.. 90 ఏళ్ల తర్వాతే తెరవాలి!
ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో గురువారం రెండు కోవిడ్ మరణాలు నమోదు కాగా 107 కొత్త కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసుల సంఖ్య 963గా ఉంది. ఇక ఇప్పటివరకు పుదుచ్చేరిలో 1,827 మంది మృతి చెందారు. ప్రాంతాల వారీగా మరణాలను చూస్తే టోల్ పుదుచ్చేరి (1,437), కారైకల్ (242), యానం (106) మాహే (42)గా ఉన్నాయి. ఇక ఎక్కడ రికవరీ రేటు 97 శాతానికి పైనే ఉంది.
