died
Request to PM Modi: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు పాల్పడక ముందు సూసైడ్ నోట్ రాస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి రిక్వెస్ట్ చేశాడు. నిర్మాతగా మారి తన మరణంపై అర్జిత్ సింగ్ తో ఒక పాట పాడించాలని, దానికి సుషాంత్ ఖత్రీ కొరియోగ్రఫీ చేయగా నేపాలీ ఆర్టిస్టుతో సాంగ్ చేయాలని రాసుకొచ్చాడు.
పదకొండో తరగతి చదువుతున్న ఈ టీనేజర్.. ఆదివారం రాత్రి రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ కావాలని ప్రయత్నించిన అతనికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్ దొరక్కపోవడంతో ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సూసైడ్ నోట్ లో.. చివరి కోరికను చెప్పి అది పూర్తయితేనే ఆత్మశాంతిస్తుందని పేర్కొన్నాడు. ఆత్మహత్యపై విచారణ జరిపి పూర్తి వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.
……………………………………..: బుల్లెట్ ప్రూఫ్‌లా మారి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్