Phone Stopped Bullet: బుల్లెట్ ప్రూఫ్‌లా మారి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్
ఐదేళ్ల పాతదైన మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది.

Moto
Phone Stopped Bullet: ఐదేళ్ల పాతదైన మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఒక మనిషి ప్రాణం కాపాడింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది. దొంగతనం జరుగుతుండగా సంభవించిన కాల్పుల్లో మోటో జీ5 కవచంలా వ్యవహరించింది. ఆశ్చర్యకరంగా ఫోన్ కు వేసి ఉన్న పౌచ్ మీద The Incredible Hulk డిజైన్ ఉంది.
గత వారం బ్రెజిల్ లో ఓ దొంగతనం జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై బుల్లెట్ ఫైర్ చేశారు. అది నేరుగా స్మార్ట్‌ఫోన్‌కు తగిలి డైవర్ట్ అయి నడుము భాగంలోకి దూసుకెళ్లింది. అలా చిన్నపాటి గాయంతో బయటపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.
బుల్లెట్ వేగం మొత్తాన్ని అడ్డుకున్న మోటో జీ5 ఫోన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఫొటోను షేర్ చేసిన డాక్టర్ వెనుకకు కాస్త సొట్ట పడినట్లుగా చూపించాడు. దానిపై ఉన్న Hulk కవర్.. ఈ ఘటనపై మంచి ఇంప్రెషన్ తెచ్చిపెట్టింది. అప్పట్లో ఈ మోటో జీ5 స్మార్ట్ ఫోన్ మంచి బరువుతో మందపాటి డిజైన్ తో ఉండేది. రీసెంట్ గా వస్తున్న ఫోన్లు స్లిమ్ బాడీతో ఇలాంటి ఘటనల నుంచి కాపాడతాయా అనే సందేహం రాకమానదు.
……………………………………………………. : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్ ప్రభుత్వం
ఈ మోడల్ ఫోన్ మాత్రమే కాకుండా PhoneArena, Samsung Galaxy Mega, iPhoneలు కూడా బుల్లెట్లను ఆపి యజమానుల ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి.

Moto G5