Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌ ప్రభుత్వం

బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై రాజస్థాన్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ చట్టం వివాదం కావటంతో ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.

Rajasthan Child marriage : బాల్య వివాహాల రిజిస్ట్రేషన్‌ చట్టంపై వెనక్కి తగ్గిన రాజస్థాన్‌ ప్రభుత్వం

Rajasthan Child Marriage

Rajasthan Govt U Turn Proposed Child Marriage Registration : బాల్య వివాహాలు దురాచార, నేరం. చట్ట వ్యతిరేకం. కానీ రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం అత్యుత్సాహంతో బాల్య వివాహాలను చట్టబద్దం చేసింది. అంతేకాదు బాల్య వివాహాలు చేసేవారు చేసుకునేవారు కూడా అధికారికంగా నమోదు చేసుకోవచ్చని కూడా తెలిపింది.బాల్య వివాహం జరిగికా నెల రోజుల లోపు వివరాలు తెలపాలని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా చట్టబద్ధం చేస్తే పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చట్టం కాస్తా వివాదంగా మారటంతో రాజస్థాన్ ప్రభుత్వం వెనక్కుతగ్గింది.

Read more : Child marriage : బాల్య వివాహాలను చట్టబద్ధం చేసిన రాజస్థాన్..

బాల్యవివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయాలని చేసిన చట్టంపై రాజస్థాన్‌ ప్రభుత్వం వెనక్కుతగ్గింది. తప్పనిసరి రిజిస్ట్రేషన్ల వివాహ(సవరణ)బిల్లు-2021ను రాజస్థాన్‌లో గత నెల అసెంబ్లీలో ఆమోదించిన విషయం తెలిసిందే. బాల్య వివాహాలు, మైనర్ల వివాహాలు సహా అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సవరణ చట్టం తీసుకువచ్చింది. దీనిపై వ్యతిరేకతలు వచ్చిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.పైగా ఈ చట్టం చేయటం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే తప్ప బాల్య వివాహాలను ఆమోదించి చట్టం చేసినట్లు కాదని ప్రభుత్వం సర్ధిచెప్పుకోవాలని యత్నించిది. ఈ క్రమంలో ఈ చట్టం ద్వారా బాల్య వివాహాలను ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్న ఈ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నామని ఎం అశోక్‌ గెహ్లోత్‌ తెలిపారు. చట్టాన్ని వెనక్కు తీసుకున్నా..బాల్య వివాహాలను మా ప్రభుత్వం అరికడుతుందని సీఎం తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే సవరణ చట్టాన్ని తీసుకువచ్చామని కానీ..ఈ చట్టం బాల్య వివాహాలను ప్రోత్సహించేలా ఉందనే అభిప్రాయాలు రావటంతో ఈ చట్టాన్ని వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు.

Read more : బాల్య వివాహాలల్లో టాప్-4లో భారత్..ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్ : UNICEF

కాగా సవరించిన చట్టం ప్రకారం..18 ఏళ్లకు తక్కువగా ఉన్న యువతులు 21 ఏళ్లకు తక్కువ ఉ‍న్న యువకులకు సంబంధించిన వివాహాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని పేర్కొంది. బాల్యవివాహాలను తగ్గించాలనే ఉద్దేశంలో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అలాగే ప్రజలు కూడా తమ వ్యతిరేకతను నిసనల ద్వారా వెల్లడించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంది.

Read more : leave letter viral :‘అడుక్కోవడానికి వెళ్లాలి..ఆదివారం సెలవివ్వండి’..లీవ్ కోసం మైండ్ బ్లాంక్ కారణాలు చెప్పిన ఇంజనీర్

కాగా.. రాజస్థాన్‌లో బాల్యవివాహాల సంఖ్య అధికంగా ఉన్న విషయం తెలిసిందే.కాగా అసెంబ్లీలో ఈ బిల్లు పాసైన ఈ రోజు బ్లాక్ డే అంటూ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ లహోటీ మండిపడ్డారు. చట్టసవరణ చేయడం ద్వారా బాల్య వివాహాలను చట్టబద్ధంగా అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇలా ప్రతిపక్షా నుంచే కాకుండా సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లెవెత్తాయి.