బాల్య వివాహాలల్లో టాప్-4లో భారత్..ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్ : UNICEF

బాల్య వివాహాలల్లో టాప్-4లో భారత్..ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్ : UNICEF

India in fourth place in child marriages : ఈ  కంప్యూటర్ యుగంలో కూడా బాల్యవివాహాలు జరుగుతుండటం విచారించదగిన విషయం. బాల్యవివాహాలకు అడ్డకు కట్ట వేయటానికి చట్టాలు ఉన్నా అవి యదేచ్ఛగా జరుగుతునే ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్దిలో దూసుకుపోతోందని పాలకు చెప్పే భారతదేశంతో బాల్య వివాహాలు జరిగే విషయంలో ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) సోమవారం (మార్చి 8,2021) విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల్లో బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ టాప్-4లో ఉందని యూనిసెఫ్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వున్న మహిళల్లో దాదాపు 65 కోట్ల మంది మహిళలకు బాల్యంలోనే వివాహాలు జరిగాయని తెలిపిన యూనిసెఫ్.. వీరిలో సగం మంది ఐదు దేశాలకు చెందిన వారేనని తెలిపింది. ఈ ఐదు దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానంలో ఉందని తెలిపింది.

బాలికలకు అత్యధికంగా పెళ్లిళ్లవుతున్న దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మొదటి స్థానం ఉంది. ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్, ఇథియోపియా, భారత్, నైజీరియాలు ఉన్నాయి. ఈ దేశాల్లోని 30-35 కోట్ల మంది మహిళలకు 18 ఏళ్ల లోపే వివాహం జరిగినట్టు యూనిసెఫ్ పేర్కొంది.

కరోనా కారణంగా బాల్య వివాహాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని, వచ్చే దశాబ్దకాలంలో 10 కోట్ల మంది బాలికలు పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని యూనిసెఫ్ అంచనా వేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలను మూసివేయడం, ఆర్థిక ఒత్తిడి, తల్లిదండ్రుల మరణాలు మరియు గర్భాలు బాల్యవివాహాల ప్రమాదాన్ని పెంచుతాయని నివేదిక పేర్కొంది.