leave letter viral :‘అడుక్కోవడానికి వెళ్లాలి..ఆదివారం సెలవివ్వండి’..లీవ్ కోసం మైండ్ బ్లాంక్ కారణాలు చెప్పిన ఇంజనీర్

‘అడుక్కోవడానికి వెళ్లాలి..ఆదివారం సెలవివ్వండి’..అంటూ ఓ ఇంజనీర్ ఉన్నతాధికారులకు లీవ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. లెటర్ లో అతను రాసి వివరాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే..

leave letter viral :‘అడుక్కోవడానికి వెళ్లాలి..ఆదివారం సెలవివ్వండి’..లీవ్ కోసం మైండ్ బ్లాంక్ కారణాలు చెప్పిన ఇంజనీర్

Leave Letter Viral

MP Engineer leave letter viral : ‘నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలు చేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్’ అంటూ కానిస్టేబుల్ లీవ్ లెటర్. ‘మా బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ’ అంటూ ఓ వ్యక్తి పెట్టుకున్న లీవ్ లెటర్.. నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి సెట్ చేసి పెట్టండీ సార్ అంటూ ఓ వ్యక్తి ఎమ్మెల్యేకు రాసిన లెటర్ ఇలా పలు రకాల లెటర్లు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. కానీ వీటిని భిన్నంగా మరింత షాకింగ్ కలిగించే మరో లీవ్ లెటర్ సోషల్ మీడియా పిచ్చి పిచ్చిగా వైరల్ అవుతోంది.

అదేమంటే..ఓ డిప్యూటీ ఇంజనీర్ ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ పెట్టుకుంటు దాంట్లో ఎందుకోసం లీవ్ కావాలో ఇలా రాశాడు. ‘అడుక్కోవటానికి వెళ్లాలి…ఆదివారం లీవ్ కావాలి సార్’’అంటూ పేర్కొన్నాడు. ఆదివారం అందరికి సెలవు ఉంటుంది.మరి ప్రత్యేకించి ఆదివారం సెలవు కావాలని అడగటమేంటీ?పైగా ఓ ఇంజనీరు అడుక్కోవటానికి లీవ్ అడగటమేంటి? అంటూ నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. పైగా అతను చెప్పిన ఇంకొన్ని విషయాల గురించి తెలిస్తే మనకు మెంటల్ ఎక్కటం ఖాయం అన్నట్లుగా ఉంది. మరి అతను ఏమేమి చెప్పాడో ఓ లుక్కేయండీ..

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

మధ్యప్రదేశ్‌ కు చెందిన రాజ్‌కుమార్‌ యాదవ్‌. డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతను ఉన్నతాధికారులకు ఓ లీవ్ లెటర్ పెట్టుకున్నాడు. ఆ లెటర్ లో ‘సార్..నేను ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయండీ’ అంటూ అభ్యర్ధించాడు. ఆలెటర్ లో మ్యాటర్ చదివిన ఉన్నతాధికారులు షాక్ అయ్యారు. అతడిని పిలిచి.. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నీవు అడుక్కోవడం ఏంటయ్యా బాబూ ఇదేం పని అంటూ ప్రశ్నించారు.దానికి రాజ్ కుమార్ చెప్పిన సమాధానం విని వారికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వారిని షాక్‌కు గురి చేసిన ఆ సమాధానం ఏంటంటే..‘‘నాకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నా’ అని చెప్పాడు.నాలో ఉండే అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలని అనుకుంటున్నా..దీని కోసం అన్వేషణ చేస్తూ.. ఆత్మ శోధన చేయాలనుకుంటున్నా’ అని చెప్పాడు. అంతేకాదు రాజ్ కుమార్ చెప్పిన మరిన్ని వివరాలు విన్న ఆ అధికారులు ఎంతగా షాక్ అయ్యారంటే..ఇతనికేమన్నా మానసిక సమస్యలు ఉన్నాయా? లేదా మనకేమన్నా కథలు చెబుతున్నాడా? అని ఆశ్చర్యపోయేంత…

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

రాజ్ కుమార్ లెటర్ లో ఏముందంటే..‘‘ ఇప్పుడు ఈ జన్మలో నేను ఇంజనీర్ గా పనిచేస్తున్నా..కానీ నేను గత జన్మలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్‌ ఓవైసీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ముగ్గురు మంచి స్నేహితులం. మేమంతా మహాభారత కాలంలో స్నేహితులం. ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు. మోహన్‌ భగవత్‌ దుర్యోధనుడి మేనమామ శకుని మామ. గత జన్మలో ఓవైసీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నా ప్రాణ స్నేహితులు. ఆదివారం సెలవు పెట్టి భిక్షాటన చేయాలి. అందుకే లీవ్ అడుగుతున్నా..భిక్షాటనతో పాటు నేను ఇప్పటి వరకు ధరించిన మరిన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలన్నా.. అంటూ లెటర్ లో రాశాడు రాజ్‌ కుమార్‌.

ఇక ఈ లేఖ చదివిన రాజ్‌కుమార్‌ ఉన్నతాధికారులు పరిస్థితి ఎలా ఉందంటే అంతకు మించి అన్నట్లుగా ఫన్నీ ఫన్నీగా ఉంది. ఈ లెటర్ పై జనపద్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి సమాధానమిస్తు..”ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్ గారూ..మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం” అని రిప్లై ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ లీవ్‌ లెటర్‌పై నెటిజనులు తెగ నవ్వుకుంటున్నారు. ఏందిరా బాబూ లీవ్ లెటర్ కోసం ఇన్ని వేషాలా? అంటున్నారు. మరికొందరేమో..ప్రభుత్వ ఆఫీసుల్లోనే ఇటువంటివారుంటారా ఏంటీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి బిత్తిరి జనాలు మన దగ్గరే ఉంటారులా ఉందే అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Read more:ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

కాగా పర్టిక్యులర్ గా రాజ్ కుమార్ ఆదివారం సెలవు ఎందుకు అడిగాడు? ఆదివారం సెలవు సర్వసాధారణమే కదా అని అనుకోవచ్చు. అసలు విషయం అక్కడే ఉంది. సీనియర్ ఆఫీసర్ ఆదివారం కూడా పని చేయాలని ఉద్యోగుల్ని కోరారట. దీంతో ఆదివారం సెలవు కోసం సరదు ఇంజనీర్ ఇలాంటి ఫన్నీ రీజన్ చెప్పాడని సమాచారం.