viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి..మీరు నాకు చూసిపెట్టండీ సార్ అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేకు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

viral letter : ఎమ్మెల్యేగారూ..నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి..చూసిపెట్టండి సార్…

Mla Letter Girl Friend

young man Letter to MLA to become girlfriend : ‘అమ్మాయిలు ఎవరు నాకు పడటం లేదు..మీరే నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ ను చూసి పెట్టండి సార్..అంటూ ఓ యువకుడు ఏకంగా ఎమ్మెల్యేకే లెటర్ రాశాడు. గర్ల్ ఫ్రెండ్ కోసం ఏకంగా ఎమ్మెల్యేకే లెటర్ రాసిన వీడెవడ్రా బాబూ అంటున్నారు జనాలు. మా ఊరికి రోడ్లు వేయించండీ సార్ అనో, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండీ అని కోరుతు వారి నియోజకవర్గం ఎమ్మెల్యేలకు లెటర్ రాస్తారు. కానీ మహారాష్ట్రలో ఓ యువకుడు మాత్రం నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి…చూసి పెట్టండీ సార్ అంటూ లెటర్ రాశాడు. ఈ లెటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఎవరా యువకుడు అంటే..

మహారాష్ట్రలోని చంద్రపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు భూషణ్ జామువంత్ అనే యువకుడు తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుతూ మరాఠీ భాషలో లేఖ రాశాడు. ఈ లెటర్ లో సదరు యువకుడు రాసిన సారాంశం ఇలా ఉంది. ‘‘మా ప్రాంతంలో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. వారిని ప్రేమించిటానికి ఎన్నో యత్నాలు చేశాను. కానీ ఎవ్వరూ నాకు పడటంలేదు. నన్ను ఏ అమ్మాయి ఇష్టపడటం లేదు. దీంతో నాకు ఆందోళన పెరిగిపోతోంది. నా మీద నాకే నమ్మకంపోతోంది. నా ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది’’అంటూ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more : కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

అంతేకాదు మద్యం తాగేవారికి, క్రమశిక్షణ లేకుండా అల్లరిచిల్లరగా తిరిగేవారికి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారనీ..అటువంటివారిని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది. కోపం వస్తుంది. నామీద నాకే కోపం వస్తుంది. ఎవరన్నా జంటలు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే చూసి నా గుండె తరుక్కుపోతోంది అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more : నా ప్రియమైన గేదె ప్రసవించింది..సేవలుచేసి రుణం తీర్చుకోవాలి లీవ్ ఇవ్వండి సార్ : అధికారులకు కానిస్టేబుల్ లెటర్

ఈ ఉత్తరాన్ని చూసిన ఎమ్మెల్యే సుభాష్ ‘నాకు గతంలో ఇటువంటి లేఖలు ఎప్పుడూ రాలేదని..ఇది భలే గమ్మత్తుగా ఉందని అన్నారు. ఈ భూషణ్ జామువంత్ ఎక్కడ ఉంటాడనే విషయం తెలియలేదని, అందుకే అతని సమాచారాన్ని తెలుసుకునే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించానని తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే..అతనికి కౌన్సెలింగ్ చాలా అవసరం అని ప్రేమ అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే..కానీ ఎవ్వరూ తనను ప్రేమించట్లేదని ఇలా ఆవేదనకు గురికావద్దని సూచించారు. అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తానని తెలిపారు. కానీ ఇటువంటి టాపిక్స్ తో లెటర్లు రాయటం సరికాదని సూచించారు.