కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

  • Published By: nagamani ,Published On : December 11, 2020 / 10:33 AM IST
కానిస్టేబుల్ లీవ్ గోల : బావమరిది పెళ్లికి వెళ్లాలి..లేకుంటే నా భార్యతో వేగలేను ప్లీజ్ సెలవు ఇవ్వండీ..

MP Constable Leave Letter Viral : సెలవు కావాలంటూ ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు పెట్టుకున్న లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లెటర్ లో సదరు కానిస్టేబుల్ ఏం రాశాడంటే..‘‘సార్..దయచేసి నాకు సెలవు ఇవ్వండీ..నా బావమరిది పెళ్లికి వెళ్లాలి..సెలవు దొరకలేదని చెప్పి ఆ పెళ్లికి వెళ్లకుంటే నా భార్యతో పెట్టే టార్చర్ భరించలేను. దయచేసి నాకు లీవ్ సాంక్షన్ చేయండి సార్..ఇవ్వటం కుదరదని మాత్రం చెప్పొద్దు..నా బాధ అర్థం చేసుకోండి’’అంటూ కోరిన విన్నపం ఆసక్తిగా మారింది.



వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన దిలీప్ కుమార్ అహిర్వార్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో దిలీప్ కుమార్ భార్య సోదరుడి పెళ్లి డిసెంబర్ 11న జరుగనుంది. ‘‘సెలవులు దొరకలేదనీ..పెళ్లికి రావటం కుదరదని వంకలు చెప్పి పెళ్లికి రాలేదండీ నీ సంగతి చెప్తానంటూ’’ భార్య హుకుం జారీ చేసిందట. దీంతో భార్య సంగతి తెలిసిన దిలీప్ ముందస్తు జాగ్రత్త చర్యగా ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ పెట్టుకున్నాడు. ఈ లెటర్ లో అతని రాసిన కారణాలు వైరల్ గా మారాయి.



‘‘డిసెంబర్ 11న త్వరలో తన బావమరిది పెళ్లి జరుగుతోందని, తనకు సెలవు ఇవ్వాల్సిందేనని దిలీప్ కుమార్ ఆ లేఖలో స్పష్టం చేశాడు. పొరబాటున కూడా సెలవు లేదని అనొద్దని, తాను ఈ పెళ్లికి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పాడు.ఒకవేళ తాను ఈ పెళ్లికి వెళ్లకపోతే జరిగే అనర్థాల గురించి తన భార్య ఇప్పటికే హెచ్చరించిందని..ఆ వివరాలను లేఖలో రాయలేని పరిస్థితి నాది.. దయచేసి నా బాధను..నా పరిస్థితిని అర్థం చేసుకుని ఐదు రోజులు సెలవు మంజూరు చేయాలని ప్రాధేయపడుతు లెటర్ రాసాడు.



దీనిపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ సెలవు చీటీని తాము తీవ్రంగా పరిగణించడంలేదని..కిందిస్థాయి ఉద్యోగులు ఇటువంటి సాకులు చెప్పి సెలవులు అడగడం సాధారణమైన విషయమేనని కొట్టిపారేశారు. పోలీసు ఉద్యోగం ఎంతో ఒత్తిడితో కూడుకున్నదే అయినా..ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉండాల్సిందేనని..దిలీప్ కుమార్ కు సెలవు ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు.



దిలీప్ కుమార్ లెటర్ చూసిన అధికారులు లీవ్ ఇవ్వకపోగా… లెటర్‌లో రాసిన విధానం సరిగ్గా లేదని అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కానిస్టేబుల్ దిలీప్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది.



కాగా..ఈ లెటర్ పై నెటిజన్లు మాత్రం వింత వింతగా స్పందిస్తున్నారు. ఎంతటివాడైనా భార్యాబాధితుడేనంటూ కొంతమంది స్వసానుభవమున్నవారు అంటుంటే..ఇంకొందరు భార్యను గయ్యాళిగా చిత్రీకరించే ఇటువంటివాళ్లకు సెలవు ఇవ్వకుండా అధికారులు మంచిపనే చేశారంటున్నారు.



కాగా గతంలో మధ్యప్రదేశ్ లోనే ఓ కానిస్టేబుల్ నా గేదె ఈనే సమయం వచ్చింది..నాకు లీవ్ ఇవ్వండి సార్ అంటూ ఉన్నతాధికారులకు పెట్టుకున్న లీవ్ లెటర్ కూడా వైరల్ గా మారింది. ఆ గేదె వల్లనే మా కటుంబం ఆరోగ్యంగా ఉందని అదిచ్చే పాల వల్లనే మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని అటువంటి గేదె ఈనె సమయంలో దానికి నేను సేవలుచేసుకోవాలని లీవ్ లెటర్ లో మెన్షన్ చేస్తూ లీవ్ కోరిన విషయం తెలిసిందే.



అలాగే 2019 జనవరిలో కర్నాటకలోని బేగూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే మారుతి అనే కానిస్టేబుల్ కూడా ఉన్నతాధికారులకు ఓ వింత లీవ్ లెటర్ రాశాడు. ఇది చాలా ఫన్నీగా ఉండటంతో అధికారులు కూడా నవ్వుకున్నారు. ఆ మారుతి రాసిన లెటర్ లో..తనకు ఇటీవలే వివాహమైంది. తన భార్యతో కలిసి కొన్ని పూజలు చెయ్యాల్సి ఉంది.. అంతేకాదు..పెళ్లి అయిన కొద్ది రోజులకే డ్యూటీలో జాయిన్ అయిపోయాను..నా భార్యతో ఏకాంతగా ఉండటం కుదరటంలేదు.



బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఓకే..కానీ అవ్వక అవ్వక నాకు పెళ్లి అయ్యింది. నా భార్యకు దూరంగా ఉండి..ఆగలేకపోతున్నా..మాంచి మూడ్‌లో ఉన్నానని తన పరిస్థితి అర్థం చేసుకొని 10 రోజులు సెలవు ఇవ్వాలని సిఐకి లేఖ రాశాడు. ఆ సెలవు లెటర్ ను చదివిన అధికారులు నవ్వుకోగా… ఎవరో దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో వైరల్ అయ్యింది.