Nepal Flash Floods : నేపాల్‌లో మళ్లీ ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియో వైరల్

Nepal Flash Floods : నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదల సంభవించాయి. అయితే, అప్పటికే ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Nepal Flash Floods

Nepal Flash Floods : నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించాయి. గోర్ఖా ప్రాంతంలోని బుధిగండకి నది ఉధృతంగా ప్రవహించింది. అయితే, అప్పటికే అధికారులు అప్రమత్తమై నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఆకస్మిక వరదల ఉధృతి ఇండ్లు నేలమట్టం అయ్యాయి.

Also Read : Bollaram Kidnapping Case : బొల్లారంలో చిన్నారి కిడ్నాప్, మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..! సెక్యూరిటీ గార్డే హంతకుడు..

చుమ్నుబ్రి గ్రామంలో కొండచరియలు విరిగిపడడంతో బుధిగండికి నదికి అడ్డుకట్ట పడిందని.. దీంతో దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని అధికారులు తెలిపారు. అయితే, ఆ వరద త్రిశూలి నదిలో కలుస్తుండటంతో నదీ సమీపంలోకి ఎవరూ వెళ్లొద్దని.. ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలని నేపాల్ అంర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

వరద ప్రవాహానికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు వేలాడే వంతెనలు, ఒక స్టీల్‌ వంతెన కొట్టుకుపోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని నేపాల్‌ సైన్యం రక్షించగా, జలవిద్యుత్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న 18 మంది సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు.

బుధిగండకి నది త్రిశూలి నదిలో కలుస్తుంది. వరద ముప్పు దృష్ట్యా గోర్ఖా, తనహున్‌, చిత్వన్‌, తూర్పు నావల్పరాసి, పశ్చిమ నావల్పరాసి జిల్లాల్లోని నదీ తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నది ఒడ్డుకు వెళ్లవద్దని, ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. సహాయక చర్యలను నేపాల్‌ సైన్యం, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.