దేశ ఆత్మను కాపాడారు : ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
- veegam team
- Published On : February 11, 2020 / 09:31 AM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆప్ గెలిపించి దేశ ఆత్మను కాపాడారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మూడోసారి సీఎం పీఠంపై కూర్చోనున్న కేజ్రీవాల్ కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. ఆప్ గెలుపు కోసం కృషి చేశారు. ఆప్ ఎన్నికల ప్రచారంలో కీ రోల్ ప్లే చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం(ఫిబ్రవరి 11,2020) వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆప్ 50కి పైగా స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 35. ఇక బీజేపీ విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఓటర్ల మనసులు గెల్చుకోలేకపోయారు.
ఢిల్లీ ప్రజల గుండెల్లో క్రేజీ.. కేజ్రీవాలేనని తేల్చేశాయి ఫలితాలు. కేంద్ర పెద్దలు సహా వెయ్యి మందికి పైగా సైన్యం మోహరించినా.. సింహం సింగిల్‌గా పోరాటం చేసిందని కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు ప్రజలు. అయితే కేజ్రీ గెలుపు గాలివాటమో మరొకటో కాదు. రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీకి మూడోసారి కూడా ప్రజలు పట్టం కట్టారంటే కేజ్రీవాల్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి కేజ్రీవాల్ స్పష్టమైన లక్ష్యంతో ప్రజల దగ్గరకు వెళ్లారు. ఢిల్లీ సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. వాటన్నింటినీ తీర్చేందుకు కావాల్సిన అంశాలు, వనరులపై మేధావులతో చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన సైతం 2015లో డివిజన్ల వారీగా, రాష్ట్రం మొత్తానికి అవసరమైన విధానాలను పొందుపరిచి ప్రజల ముందుకెళ్లారు. దీంతో 70 స్థానాలకు 67 స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరించారు.
Thank you Delhi for standing up to protect the soul of India!
— Prashant Kishor (@PrashantKishor) February 11, 2020
