EPFO: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్ లోకి 8.25% వడ్డీ డబ్బులు.. ఇలా చెక్ చేసుకోండి
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీని అందించాలని ఈపీఎఫ్‌వో(EPFO) బోర్డు నిర్ణయించింది.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 09:56 PM IST
The 8.25 percent EPFO interest amount will soon be credited to accounts.
- త్వరలోనే ఈపీఎఫ్ వడ్డీ జమ
- ఆలస్యమైనా పూర్తి వడ్డీ గ్యారెంటీ
- ఇలా సులభంగా బ్యాలెన్స్ చూసుకోండి
EPFO: ఈపీఎఫ్‌వో (EPFO) చందాదారులకు త్వరలోనే ఒక మంచి శుభవార్త అందనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీని అందించాలని ఈపీఎఫ్‌వో బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం కోసం వేచి చూస్తోంది. ఆర్థిక శాఖ నుండి అధికారిక అనుమతి లభించిన వెంటనే, ఈ నెల లేదా వచ్చే నెలలో వడ్డీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వ ప్రక్రియలు, అకౌంట్ల అప్‌డేట్ వల్ల సాధారణంగానే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమవుతుంటుంది.
Ktr: విషనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం.. మలేషియా వేదికగా కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
అయితే, వడ్డీ జమ కావడంలో ఆలస్యం కావడం వల్ల తమకు నష్టం జరుగుతుందని చాలామంది ఖాతాదారులు ఆందోళన చెందుతుంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. 1952 ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం.. ప్రతి నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగానే అధికారులు వడ్డీని లెక్కిస్తారు. సాంకేతిక లేదా పరిపాలనాపరమైన కారణాల వల్ల మీ పాస్‌బుక్‌లో వడ్డీ వివరాలు ఆలస్యంగా కనిపించినప్పటికీ, చందాదారులకు రావలసిన పూర్తి వడ్డీ మొత్తం ఖచ్చితంగా అందుతుంది.
ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ వివరాలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక యూఏఎన్ (UAN) పోర్టల్‌లోకి లాగిన్ అయి పాస్‌బుక్ చూసుకోవచ్చు లేదా ఉమాంగ్ (UMANG) యాప్‌ని ఉపయోగించవచ్చు. మొబైల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, 7738299899 నంబర్‌కు “UAN EPFOHO ENG” అని ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చు. అయితే, ఈ సేవలను ఉపయోగించుకోవడానికి మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్, పాన్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి.
