TVK Vijay CM Status : విజయ్ రిమోట్ స్టాలిన్ చేతిలో..!
TVK Vijay CM Status : తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ భవిష్యత్తుని నిర్ణయించేది స్టాలినా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
- Dharani Pilli
- Updated on- May 9, 2026 / 03:39 PM IST
The decision on TVK Vijay CM aspirations lies in DMK Stalin hands
- విజయ్ సీఎం నిర్ణయం స్టాలిన్ చేతుల్లో
- విజయ్ కి మద్దతిచ్చే పార్టీలు ముందు స్టాలిన్ తో భేటీ
- విజయ్ సీఎం అయినా సవాళ్లు తప్పవంటున్న విశ్లేషకులు
TVK Vijay CM Status : తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ క్షణానికి ఎలాంటి ఊహించని ట్విస్ట్ తెర మీదకు వస్తుందో తెలియని పరిస్థితి. సీఎం సీటుకు దగ్గరగా వెళ్లి వెనక్కి వచ్చేస్తున్నారు విజయ్. ఇప్పటికి మూడు సార్లు గవర్నర్ నుంచి నిరాశ ఎదురైంది. అయితే, తమిళనాడు రాజకీయాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్న వారిని అడిగితే అసలు విజయ్ సీఎం సీటు మాజీ సీఎం స్టాలిన్ చేతిలో ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. టీవీకే 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించి ఉండొచ్చు. డీఎంకే 59 సీట్లతో రెండో ప్లేస్ లో ఉంది. కానీ, విజయ్ సీఎం సీటులో కూర్చోవడాన్ని స్టాలిన్ డిసైడ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముందే పొత్తు పెట్టుకున్న పార్టీలతో స్టాలిన్ సమావేశమయ్యారు. ఎన్నికల తర్వాత పొత్తుల మీద మీకు నచ్చిన దారిలో వెళ్లవచ్చని వారికి ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ కోయిల కొంచెం ముందే కూయడంతో ఆ పార్టీతో కటీఫ్ చెప్పేశారు.
*తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. హుటాహుటీన హైదరాబాద్ ఎమ్మెల్యేలు..
విజయ్ పార్టీకి మద్దతిస్తున్న సీపీఐ, సీపీఎం కూడా టీవీకేకి సపోర్ట్ చేయడానికి ముందు స్టాలిన్ తో సమావేశమయ్యాయి. స్టాలిన్ నిర్ణయం మేరకే ఆ రెండు పార్టీలు ప్రభుత్వంలో కాకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. అదే క్రమంలో తమిళనాట బీజేపీని అడ్డుకోవడానికి డీఎంకేతో కలసి పనిచేస్తామని ప్రకటించాయి. అంటే, ఓ రకంగా సీపీఐ, సీపీఎం రెండూ స్టాలిన్ చెప్పుచేతల్లోనే ఉన్నాయి.
ఇక వీసీకే కూడా దళిత భావజాలం ఉన్న పార్టీ. ఆ పార్టీ కూడా టీవీకేకు మద్దతు ఇవ్వడంపై హైడ్రామా క్రియేట్ చేస్తోంది. భారీగా డిమాండ్లు పెడుతోంది. రెండు సీట్లు ఉన్న పార్టీ ఏకంగా డిప్యూటీ సీఎం పదవితోపాటు తిరుచ్చి తూర్పు నుంచి విజయ్ రాజీనామా చేస్తే ఆ సీటు కూడా తమకే ఇవ్వాలని కండిషన్లు పెడుతోంది. కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చినా మద్దతు ఇచ్చే పార్టీల కండిషన్లు మాత్రం కొండవీటి చాంతాడంత ఉన్నాయి.
* విజయ్ తర్వాత నెక్స్ట్ తమిళ్ స్టార్ హీరో ఎవరు? భారీ ఓపెనింగ్స్, కలెక్షన్స్ ఎవరు తెప్పిస్తారు?
అందరినీ మెప్పించి సీఎం అయినా సరే విజయ్ కి ముందుంది ముసళ్ల పండగ. ఆరు నెలల కాలం విజయ్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్టాలిన్ ప్రకటించారు. ఆరు నెలల తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే విధానాల విషయంలో విజయ్ మోదీకి అనుకూలంగా ఉంటే.. అప్పుడు లెఫ్ట్ పార్టీలు ఠకీమని మద్దతు ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది. ఓ రకంగా స్టాలిన్ మొత్తం చక్రం తిప్పడం ఖాయంగా ఉంది.
