Jana Gana Mana : జాతీయ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడాలో తెలుసా?
మన జాతీయ గీతం మన దేశానికి గర్వ కారణం. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ మన జాతీయ గీతాన్ని రచించారు. అయితే ఈ గీతాన్ని ఎన్ని సెకండ్లలో పాడటం పూర్తి చేయాలో తెలుసా?
- Lakshmi 10tv
- Published On : August 11, 2023 / 06:13 PM IST
Jana Gana Mana
Jana Gana Mana : జాతీయ గీతం ‘జన గణ మన’ ఎవరైనా ప్లే చేసినా, పాడినా ఎక్కడ ఉన్నా భక్తి శ్రద్ధలతో వెంటనే లేచి నిలబడతాం. సెల్యూట్ చేస్తాం. జాతీయ గీతం భారతదేశానికి గర్వ కారణం. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ గీతం దేశభక్తిని, విధేయతను చాటుతుంది.
రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో ‘భరోతో భాగ్యోబిధాత’ అనే మొదటి గీతాన్ని రచించారు. దానిని సవరించి ‘జన గణ మన’ గా అనువదించారు. డిసెంబర్ 27, 1911 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి ఈ గీతాన్ని ప్రదర్శించారు. జనవరి 24, 1950 లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రకటనతో జాతీయ గీతంగా స్వీకరించారు. జాతీయ గీతం 22 జాతీయ భాషల్లోకి అనువదించబడింది. ఆర్టికల్ 51A సెక్షన్ (ఎ) ప్రకారం జాతీయ గీతాన్ని గౌరవించాలి. జాతీయ గౌరవ చట్టం 1971 సెక్షన్ (3) ప్రకారం జాతీయ గీతాన్ని అగౌరవపరిచినా, పరిమితులు ఉల్లంఘించినా కఠిన శిక్షవిధించబడుతుంది. జాతీయ గీతాన్ని 52 సెకండ్లలో పాడటం పూర్తి చేయాలి.
మన జాతీయ గీతం -మన దేశానికి గర్వ కారణం
జన గణ మన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!
తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే
భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!
