chopping onions in 30 seconds: 30 సెకండ్లలో ఉల్లిపాయను ఇలా కోయొచ్చు.. మీరూ ట్రై చేయండి.. వీడియో వైరల్

మీరు వంట చేస్తుంటారా? అయితే ఉల్లిపాయను ఎన్ని సెకండ్లలో చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు.. ఉల్లిపాయ పైపొట్టు తీయడానికే 30 సెకండ్లు పడుతుంది కదూ..

chopping onions in 30 seconds: మీరు వంట చేస్తుంటారా? అయితే ఉల్లిపాయను ఎన్ని సెకండ్లలో చిన్నచిన్న ముక్కలుగా చేస్తారు.. ఉల్లిపాయ పైపొట్టు తీయడానికే 30 సెకండ్లు పడుతుంది కదూ.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో ఉల్లిపాయను ఓ చెఫ్ 30సెకండ్లలో చిన్నచిన్న ముక్కలుగా కట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా వంట చేయడం చాలా మందికి ఒక ఆహ్లాదకరమైన పని. అయితే ఎక్కువ మంది వంట చేస్తారు కానీ.. కూరగాయలు కత్తిరించడం, పదార్థాలకు తొక్కతీయడం వంటి వాటిని కష్టంగా భావిస్తారు. ముఖ్యంగా ఉల్లిపాయలు కత్తిరించడం చాలామందికి కష్టంతో కూడుకున్న పనే. ప్రతిసారీ ఉల్లిపాయలు కోయడాన్ని ఇబ్బంది లేకుండా మార్చేందుకు కొన్ని టెక్నిక్ లు అందుబాటులో వస్తున్నాయి.

 

కుక్ బుక్ రచయిత, పోషకాహార నిపుణులు మెలానీ లియోనెల్లో తన Instagram హ్యాండిల్‌కి ఓ క్లిప్‌ పోస్టు చేశాడు. ఆమె ఉల్లిపాయను ఎలా కట్ చేసిందో చూడొచ్చు. కానీ దాని మూలాన్ని అలాగే ఉంచింది. అప్పుడు, ఆమె దానిని తలక్రిందులుగా చేసి ఉల్లిపాయ పైభాగాన్నిపట్టుకుంది. తన చెఫ్ కత్తిని ఉపయోగించి ఉల్లిపాయను కోయడం మొదలు పెట్టింది. ఆ తరువాత.. ఆమె ఉల్లిపాయను పక్కకు వంచి, ఉల్లిపాయ పొరను పొరల వారీగా కత్తిరించి సెకండ్ల వ్యవధిలో ఖచ్చితంగా చిన్నచిన్న ముక్కలు చేసింది.

 

30 సెకండ్లలో ఉల్లిపాయను ఇలా కోయొచ్చు..

చెఫ్ మోలానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొద్ది గంటల్లోనే 13.4 మిలియన్ల కుపైగా నెటిజన్లు వీక్షించారు. 8050 లైక్ లు వచ్చాయి. పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ విధానం అద్భుతంగా ఉంది అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు ‘ఓ మై గాడ్! ఇది బాగుంది..! దీన్ని అనుసరించాల్సిందే” అని అంగీకరించారు.

ట్రెండింగ్ వార్తలు