×
Ad

Encounter: ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

  • Published On : May 11, 2021 / 12:17 PM IST

Three Lashkar E Taiba Terrorists Killed In Jammu And Kashmir

Anantnag Encounter: దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో కోకర్నాగ్‌లోని వైలో ప్రాంతంలో మంగళవారం(11 మే 2021) ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. హతమార్చిన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో సైన్యం శోధిస్తుంది.

హతమార్చిన ఉగ్రవాదుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముగ్గురు ఉగ్రవాదుల హత్యను ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు పోలీసులు.

ఐజిపి కాశ్మీర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులకు అనేకసార్లు లొంగిపోయే అవకాశం కల్పించామని, అయితే వారు అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. తప్పనిసరి పరిస్థితిలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతం చేసినట్లు చెప్పారు.